బిజినెస్

విమానాశ్రయాల్లో ఇక జీఐ స్టాళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 23: దేశంలోని అన్ని విమానాశ్రయాలలో జాగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) ఉత్పత్తుల స్టాల్‌లు ఏర్పాటు చేసేందుకు ఒక విధానాన్ని రూపొందించాల్సిందిగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభు అధికారులను ఆదేశించారు. దేశంలో జీఐ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఈ చర్య దోహదపడుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జీఐ ఉత్పత్తులను దేశంలోని అన్ని విమానాశ్రయాలలో ప్రదర్శించాలని శనివారం ఇక్కడ సీనియర్ అధికారులతో జరిగిన సమావేశంలో మంత్రి సూచించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న సురేశ్ ప్రభు ‘దేశంలోని అన్ని విమానాశ్రయాలలో జీఐ స్టాల్‌లను ఏర్పాటు చేసేందుకు ఒక విధానాన్ని రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు’ అని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. కొంకన్ రీజియన్ వ్యవసాయ రంగాన్ని సమీక్షిస్తూ, జీఐలకు ప్రాచుర్యం కల్పించేందుకు వీలుగా ప్రచారం నిర్వహించాలని మంత్రి సురేశ్ ప్రభు అధికారులను ఆదేశించారు. కొంకన్ రీజియన్‌కు జీఐ ట్యాగ్ వల్ల ఉండే ప్రయోజనాల గురించి ప్రజలలో చైతన్యం కలిగించాలని ఆయన సూచించారు. దీనివల్ల జీఐ హోల్డర్‌కు అదే పేరును మరొకరు వినియోగించుకోకుండా అడ్డుకునే న్యాయపరమైన హక్కు ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ ట్యాగ్ ఉన్న ప్రాచుర్యం పొందిన సరుకులు బాస్మతి బియ్యం, డార్జిలింగ్ టీ, చందేరి ఫ్యాబ్రిక్, మైసూర్ సిల్క్, కుల్లు షాల్, కంగ్రా టీ, తంజావూరు ప్రింటింగ్స్, అలహాబాద్ సుర్ఖా, ఫరూఖాబాద్ ప్రింట్స్, లక్నో జర్దోజి, కాశ్మీర్ వాల్‌నట్ వుడ్ కార్వింగ్ వంటివి ఉన్నాయి.