బిజినెస్

మాగ్మా హౌసింగ్ ఫైనాన్స్ రుణ లక్ష్యం రెట్టింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 24: మార్టిగేజ్ ద్వారా రుణాలు అందజేసే మాగ్మా హౌసింగ్ పైనాన్స్ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో రుణాల పంపిణీని రెట్టింపు అంటే రూ.1200 కోట్లకు పెంచాలని తలపోస్తున్నట్టు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గత ఏడాది కాలంలో వసూలు కాని రుణాలు పెద్దమొత్తంలో పేరుకుపోవడంతో, భవన నిర్మాణ రుణాలను చాలావరకు కంపెనీ తగ్గించివేసింది.
‘ప్రస్తుతం మేం గతంలో చేసిన తప్పిదాలను సరిదిద్దుకునే మార్గంలో ప్రయాణిస్తున్నాం. మేం అనుసరించిన విధానాలకు సవరణలు చేశాం. ఈ నేపథ్యంలో 2019 ఆర్థిక సంవత్సరంలో రూ.1200 కోట్ల వరకు రుణాలు పంపిణీ చేయాలన్నది మా లక్ష్యం’ అని మాగ్మా హౌజింగ్ ఫైనాన్స్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మనీష్ జైస్వాల్ వెల్లడించారు. 2017లో సంస్థ 1,000 కోట్ల మేర రుణాలను పంపిణీ చేయగా, 2018లో అది రూ.600 కోట్లకు తగ్గించింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థ రుణాల కార్యక్రమం పురోగతిలో సాగుతోందని ఎండి వెల్లడించారు. సంస్థ తక్కువ ధరలో నిర్మించే ఇళ్లకు, ఆస్తుల తనఖా, నిర్మాణ రంగానికి రుణాలు అందజేస్తుంది. ప్రస్తుతం 55-60 శాతం వరకు తక్కువధరలోనిర్మించే గృహాలకు, 15 శాతం నిర్మాణ రంగానికి, ఎల్‌ఏపీకి 25 శాతం రుణాలు అందజేయనున్నట్టు జైస్వాల్ తెలిపారు. 2018లో రూ.2,700 కోట్ల మేవిలువ ఉన్న ఆస్తులను వచ్చే నాలుగేళ్లలో రూ.6,000 కోట్లకు పెంచాలన్నది లక్ష్యమన్నారు. కాగా 2018లో నిరర్ధక ఆస్తులు 5 శాతం కాగా, నికర నిరర్థక ఆస్తుల విలువ 3.2 శాతం నమోదయ్యాయి. ఈ ఏడాది నిరర్థక ఆస్తుల విలువను 4 శాతానికి, నికర నిరర్థక ఆస్తుల విలువను 2.8 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.