బిజినెస్

42 శాతం వాటాలు కొనుగోలు చేసిన ఏజీఎస్ ట్రాన్సాక్ట్ ప్రమోటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 24: ఏటీఎంలు నెలకొల్పే ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ కంపెనీకి చెందిన 42 శాతం వాటాలను టీపీజీ, యాక్టిస్‌లనుంచి తిరిగి కొనుగోలు చేసినట్టు సంస్థ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే వాటాల తిరిగి కొనుగోలుకు ఎంతమొత్తం చెల్లిచిందీ వెల్లడించలేదు. 2011లో టీపీజీ రూ.500 కోట్లు చెల్లించి కంపెనీలో 26శాతం వాటాలను కొనుగోలు చేసింది. ఏడాది తర్వాత యాక్టిస్ 16 శాతం వాటాల కొనుగోలు చేసేనాటికి వాటాల విలువ రెట్టింపయంది. ‘టీపీజీ, యాక్టిస్‌ల వాటాలను పూర్తిగా తిరిగి కొనుగోలు చేయడంతో మా వాటాలు 97 శాతానికి చేరుకున్నాయి’ అని కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రవి బి. గోయల్ తెలిపారు. మిగిలిన మూడు శాతం వాటాలు ఉద్యోగులు కలిగివుంటారని వెల్లడించారు. అయితే ఈ డీల్‌లో టీపీజీ, యాక్టిస్‌లకు ఎంత మొత్తం చెల్లించింది చెప్పడానికి ఆయన నిరాకరించారు. ఒకవేళ ఆ మొత్తం తెలిపితే కంపెనీ విలువ తెలిసేది. కాగా ఈపీఈ ఫండ్స్ కొనుగోలుకు గోయల్ 100 మిలియన్ డాలర్ల రుణంకోసం యత్నిస్తున్నారని గత ఫిబ్రవరిలో కొన్ని మీడియా కథనాలు పేర్కొనడం గమనార్హం. ఇదిలావుండగా, ఇక పబ్లిక్ ఇష్యూకు వెళతారా? అని గోయల్‌ను ప్రశ్నించినప్పుడు, ‘కంపెనీ ప్రమోటర్ల కుటుంబం, భవిష్యత్తులో మూలధన మార్కెట్‌లోకి ప్రవేశించాలని యోచిస్తున్నది’ అన్నారు. అయితే ఎప్పటిలోగా అన్న విషయం ఆయన వెల్లడించలేదు. 2017 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.1364 కోట్లతో అగ్రస్థానంలో నిలిచిన కంపెనీ వివిధ బ్యాంకులకు ఏటీఎంలను ఏర్పాటు చేస్తుంది.