బిజినెస్

భారత క్యాపిటల్ మార్కెట్‌కు దెబ్బ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 24: అమెరికా ఫెడర్ రిజర్వ్ (యూఎస్‌ఎఫ్‌ఆర్) విత్‌డ్రాలు కొనసాగడంతో భారత క్యాపిటల్ మార్కెట్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ ఒక్క నెలలోనే ఇప్పటి వరకూ 14,500 కోట్ల రూపాయల మేరకు విదేశీ పెట్టుబడలను యూఎస్‌ఎఫ్‌ఆర్ వెనక్కు తీసుకుంది. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్స్ (ఎఫ్‌పీఐ)లు 46,600 కోట్ల రూపాయలను ఉపసంహరించుకుంది.
ఈక్విటీ మార్కెట్ల నుంచి విత్‌డ్రాలు 5,360 కోట్ల రూపాయలుకాగా, డెబిట్ మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్న మొత్తం 9,219 కోట్ల రూపాయలు. ఈ నెల ఒకటి నుంచి 22వ తేదీ వరకూ అందుబాటులో ఉన్న వివరాలే ఇంత భారీ మొత్తంలో ఉపంసహరణలను సూచిస్తున్నాయి. యూఎస్‌ఎఫ్‌ఆర్ ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాల నేపథ్యంలోనే విత్‌డ్రాలు కొనసాగుతున్నాయి. ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని, అదే జరిగితే, ఎఫ్‌పీఐ వెనుకడుగు భారత క్యాపిటల్ మార్కెట్‌ను అతలాకుతలం చేసే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.