బిజినెస్

‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’కు సానుకూల స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హూస్టన్, జూన్ 24: అమెరికాలోని నాలుగు ప్రధాన నగరాల్లో నిర్వహించిన ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’ రోడ్ షోకు సానుకూల స్పందన లభించింది. ఎంతో మంది ఔత్సాహికులు ఈ షోను చూసేందుకు ఆసక్తి చూపారు. ఈ నెల 18 నుంచి 22 వరకూ జరిగిన రోడ్ షోల్లో భారత్‌లో దర్శనీయ స్థలాలపై డిజిటల్ డిప్లేలు, కరపత్రాలు, ఫొటోలు, ఇతర టూరిజం ప్రచార సమాగ్రి ద్వారా అవగాహన కల్పించారు. అమెరికా నుంచి భారత్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్యను గణనీయంగా పెంచడమే ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’ ప్రధాన లక్ష్యం. దీనికి విశేష ఆదరణ లభించిందని, రాబోయే రోజుల్లో అమెరికా నుంచి భారీగా పర్యాటకులు వస్తారన్న నమ్మకం పెరిగిందని భారత టూరిజం శాఖ సహాయ మంత్రి కేజే అల్ఫోన్స్ అన్నారు. ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’ రోడ్ షోలు ముగిసిన నేపథ్యంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గత ఏడాది అమెరికా నుంచి భారత్‌కు 13.70 లక్షల మంది వచ్చారని, భారత్ నుంచి 12.50 లక్షల మంది అమెరికాలో పర్యటించారని అన్నారు. ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని అనుకుంటున్నట్టు చెప్పారు. భారత్‌కు అమెరికా అతి పెద్ద పర్యాటక భాగస్వామిగా ఉందని, ఏటేటా ఒకదేశం నుంచి మరో దేశానికి టూరిస్టుల సంఖ్య పెరుగుతున్నదని అన్నారు. ఇలావుంటే, భారత్‌లో దర్శనీయ స్థలాలపై ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’ రోడ్ షోలో ఎన్నో వివరాలను పొందుపరిచారు. హిమాలయాల అందాలు, ప్రకృతి సోయగాలు, అందరినీ ఆశ్చర్యగొలిపే అద్భుతమైన నిర్మాణాలు, ఎడారులు, తీర ప్రాంతాలు, రాయల్ ట్రైన్ ప్రయాణాలు వంటి ఎన్నో ప్రధాన అంశాలను అందులో చేర్చారు. అదే విధంగా దేశంలోని విభిన్నమైన సంస్కృతీ సంప్రదాయాలు, అద్భుత చిత్రాలు, ట్రెకింగ్, సైక్లింగ్, రాఫ్టింగ్‌కు అనువైన ప్రదేశాలను డిజిటల్ వీడియాల ద్వారా ప్రదర్శించారు. సుమారు 5,000 సంవత్సరాల పురాతన నాగరికతకు ఆనవాలమైన భారత్‌ను చూడడం కేవలం కాలక్షేపం కాదని, ఎంతో విలువైన సమాచారాన్ని తెలుసుకున్న ఆనందం కలుగుతుందనే సందేశాన్ని ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’ అమెరికా ప్రజలకు ఇవ్వగలిగింది. భారత్‌లో అమెరికా పర్యాటకుల సంఖ్య పెరగడానికి అవసరమైన పరిస్థితులను కల్పించగలిగింది.