బిజినెస్

ఒక రూపాయి కోసం.. 138 గ్రాముల బంగారం!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూలై 1: కేవలం ఒకే ఒక రూపాయి కోసం 138 గ్రాముల బంగారాన్ని తిరిగి ఇచ్చేందుకు ఒక బ్యాంక్ నిరాకరించిన విచిత్రం సంఘటన ఇక్కడ చోటు చేసుకుంది. దీనితో ఆ ఖాతాదారుడు న్యాయం కోసం మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే, కాంచీపురం సెంట్రల్ కోపరేటివ్ బ్యాంక్ పల్లవరం బ్రాంచీ నుంచి కుమార్ అనే వ్యక్తి గోల్డ్ లోన్ తీసుకున్నాడు. 3.50 లక్షల రూపాయల విలువైన నగలను తాకట్టుగా పెట్టగా, 1.23 లక్షల రూపాయలను బ్యాంకు అప్పుగా ఇచ్చింది. వడ్డీతోసహా ఈ మొత్తాన్ని అతను 2011 మార్చి 28న తిరిగి చెల్లించాడు. అయితే, తాకట్టుపెట్టిన 138 గ్రాముల బంగారాన్ని తాకట్టు నుంచి తిరిగి ఇవ్వడానికి బ్యాంకు నిరాకరించింది. అధికారులు చుట్టూ తిరిగి వేసారిన కుమార్ చివరికి కోర్టును ఆశ్రయించాడు. ఇంతకీ, అతను చెల్లించాల్సిన మొత్తంలో కేవలం ఒక రూపాయి తక్కువగా చెల్లించాడట. అందుకే, అతనిని డిఫాల్టర్‌గా పరిగణించిన బ్యాంకు అధికారులు తాకట్టులో ఉన్న బంగారాన్ని ఇవ్వడం లేదు. ఒకే ఒక రూపాయి కోసం ఇంత రాద్ధాంతమా? అని చాలా మంది విమర్శిస్తున్నప్పటికీ, బ్యాంకు అధికారులు మాత్రం నిబంధనల విషయంలో రాజీ ఉండదని స్పష్టం చేస్తున్నారు.