బిజినెస్

ఈ-వేబిల్ మొత్తం లక్ష రూపాయలకు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 1: మహారాష్ట్ర ప్రభుత్వం ఈ-వేబిల్ మొత్తాన్ని లక్ష రూపాయలకు పెంచింది. గతంలో 50,000 రూపాయలుగా ఉన్న ఈ మొత్తాన్ని రెట్టింపు చేసింది. వ్యాపారులు ముందుగా ఈ మొత్తాన్ని డిపాజిట్ చేసి, ఈ-వేబిల్‌ను పొందుతారు. దీని ద్వారా వ్యాపారులు తమతమ వస్తువులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రవాణా చేసుకోవచ్చు. మహారాష్టల్రోనే రవాణా జరిగి, ఆ వస్తువుల విలువ లక్ష రూపాయల కంటే తక్కువగా ఉంటే, ప్రభుత్వానికి అదనంగా ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు. అంతకంటే ఎక్కువ విలువ ఉన్న వస్తువులకు మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా ఇతర రాష్ట్రాలకు రవాణా చేసినా, పన్ను తప్పనిసరి. వ్యాపారులకు ఎంతో అనుకూలంగా ఉండే ఈ-వేబిల్ విధానం విజయవంతమైంది. ఎంతో మంది వ్యాపారులు ప్రత్యేకంగా వేబిల్లును తీసుకోకుండా, దీని ద్వారానే తమవ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఎక్కువ మంది వ్యాపారులు దీనిపై మొగ్గు చూపడతో, మహారాష్ట్ర సర్కారు డిపాజిట్ మొత్తాన్ని లక్ష రూపాయలకు పెంచింది. జీఎస్‌టీ సదస్సులో ప్రభుత్వ ప్రతినిధి ఈ ప్రకటన చేశారు. ఈ-వేబిల్ వ్యాపారులకు ఎంతగానో ఉపయోగపడుతున్నదని, దీని ద్వారా లావాదేవీలు సులభంగానూ, పారదర్శకంగానూ జరుగుతున్నాయని పేర్కొన్నారు.