బిజినెస్

భారత వాణిజ్య రంగం వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 1: భారత్ పన్నుల రంగంలో, ఆర్థికవ్యవస్థలో బృహత్తరమైన సంస్కరణలకు వస్తు సేవా పన్ను ద్వారా శ్రీకారం చుట్టామని, సంక్లిష్టమైన పన్ను విధానాలకు స్వస్తి చెప్పి ఏకీకృతమైన పరోక్ష పన్నుల విధానానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఒక విలాసవంతమైన కారుకు, పాలకు ఒకే పన్నును ఎలా విధిస్తామని, కాంగ్రెస్ పార్టీ ఆమోదయోగ్యం లేని ప్రతిపాదనలను తెరపైకి వచ్చి గందరగోళం సృష్టిస్తోందని విమర్శించారు. వస్తు సేవా పన్ను కింద శ్లాబులు లేకుండా ఒకే పన్ను విధానం అమలు సాధ్యం కాదన్నారు. వస్తు సేవాపన్నును ప్రవేశపెట్టి ఏడాది గడిచిందని, పరోక్ష పన్నులను చెల్లించే వారి సంఖ్య 70 శాతం పెరిగిందన్నారు. 17 పన్నులు, 23 సెస్సులు విలీనమై ఏకీకృత పన్ను విధానంగా అవతరించాయన్నారు. కేంద్రం గతంలో సెంట్రల్ ఎక్సైజ్ పన్ను, సేవా పన్ను, విలువ ఆధారతి పన్ను, ఇంకా రకరకాల సుంకాలను విధించేదని, ఇవన్నీ వ్యాపారుల్లో అయోమయం సృష్టించేవన్నారు. ప్రస్తుతం పరోక్ష పన్నుల విధానంలో తనిఖీల
రాజ్యానికి స్వస్తిచెప్పి పన్నుల విధానాన్ని సరళీకృతం చేశామన్నారు. పన్ను చెల్లింపుదారులు, రాష్ట్రప్రభుత్వాలు, ప్రజల నుంచి ఎప్పటికప్పుడు పన్ను విధానంలో చోటు చేసుకుంటున్న మార్పులపై అభిప్రాయాలు సేకరించి అవసరమైన పక్షంలో సవరణలు చేస్తున్నామన్నారు. జీఎస్‌టీ పన్నుల విధానంపై నిరాధారమైన ఆరోపణలు చేయడం కాంగ్రెస్‌కు అలవాటైందన్నారు. స్వరాజ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పరోక్ష పన్నుల కింద 66 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు పేర్లను నమోదు చేసుకున్నారన్నారు.. కాని 2017 జూలై 1వ తేదీ నుంచి ఇంతవరకు అదనంగా 48 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు జీఎస్‌టీ పరిధిలోకి వచ్చారన్నారు. దాదాపు 350 కోట్ల ఇన్‌వాయిస్‌లు వచ్చాయని, 11 కోట్ల రిటర్న్స్‌ను పైలు చేశారన్నారు. నిజంగా జీఎస్‌టీ సంక్లిష్టంగా ఉంటే ఇంతమంది పన్ను చెల్లింపుదారులు ఉండేవారా అని ఆయన ప్రశ్నించారు. దేశంలో ఈ రోజు చెక్‌పోస్టులు లేవు. చెక్‌పోస్టుల వద్ద గంటలతరబడి వాహనాలు నిలబడే పరిస్థితి లేదు. రవాణా వ్యవస్థ వేగవంతమైంది. ఆలస్యం లేకుండా నిర్ణీత కాలపరిమితిలోపల వస్తువులు, సరుకులను గమ్యానికి చేరుతున్నాయి. ఇదంతా జీఎస్‌టీ మహిమ వల్లనేనని ఆయన అన్నారు. జీఎస్‌టీ వల్ల దేశంలో లాజిస్టిక్స్ వ్యవస్థ ఊపందుకుందన్నారు. భారతదేశ వాణిజ్య వ్యవస్థలో కొత్త అధ్యాయం జీఎస్‌టీతో మొదలైందన్నారు. దేశంలో అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ, అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవాపన్ను అనే బృహత్తరమైన పన్ను విధానం విజయవంతంగా ఒక ఏడాది పూర్తి చేసుకుని రెండవ ఏడాదిలో అడుగుపెడుతోందని ఆయన అన్నారు. ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు తొలి దశలో కొన్ని సవాళ్లు తప్పవని, వాటిని విజయవంతంగా ఎదుర్కొనాల్సి ఉంటుందన్నారు. అదే భారత సహకార సమాఖ్య వ్యవస్థలో ఉన్న గొప్పతనమన్నారు. అన్ని రాష్ట్రాలు జీఎస్‌టీ విధానానికి బేషరతుగా మద్దతు ఇవ్వడమేకాకుండా చిత్తశుద్ధితో అమలు చేశాయని ఆయన ప్రశంసించారు. జీఎస్‌టీ వల్ల 400 వస్తువులపై పన్నులు తగ్గించామన్నారు. 150 వస్తువులపై పన్నును జీరోకు తెచ్చామన్నారు. బియ్యం, గోధుములు, చక్కెర, సుగంధ ద్రవ్యాలపై పన్ను రేట్లను తగ్గిస్తూ వచ్చామన్నారు. నిత్యం వాడే సరుకులపై పన్నులను ఎత్తివేయడమో లేక ఐదు శాతం వరకే ఉంచడమో జరిగిందన్నారు. 18 శాతం శ్లాబ్‌లో 95 శాతం వస్తువులు ఉన్నాయన్నారు.