బిజినెస్

జీఎస్‌టీ చెల్లింపుల్లో సింగరేణి టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ జోన్ పరిధిలో ఉన్న పరిశ్రమల్లో అత్యధిక జీఎస్‌టీని చెల్లించిన సంస్థగా సింగరేణి టాప్‌లో నిలిచిందని జీఎస్‌టీ చీఫ్ ప్రిన్సిపల్ కమిషనర్ అగర్వాల్ అన్నారు. జీఎస్‌టీ డే ఉత్సవాలు ఆదివారం ప్యాప్సీ భవనంలో జరిగాయి. ఈ సందర్భంగా అగర్వాల్ కీలక ఉపన్యాసంలో మాట్లాడుతూ జీఎస్‌టీ చెల్లింపుల్లో సింగరేణి టాప్ స్థానం దక్కడం పట్ల ఆయన అభినంధించారు. 2017 జూలై 1వ తేదీన జీఎస్‌టీ అమలులోకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. 2018 మార్చి నాటికి సింగరేణి సంస్థ రూ 2100 కోట్లు చెల్లించిందని, దీంతో పాటు అన్ని రకాల పన్నులు కూడా సింగరేణి చెల్లించిందని ఆయన చెప్పారు. జీఎస్‌టీ అవార్డును సింగరేణి సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్) ఎస్. శంకర్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థ జనరల్ మేనేజర్ నర్సింహారెడ్డి, నరసింహమూర్తితో పాటు సంస్థ పౌరసంబంధాల అధికారి మహేష్ పాల్గొన్నారు.
మొదటి త్రైమాసికంలో
సింగరేణి 8.4 శాతం వృద్ధి
ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో సింగరేణి సంస్థకు అనుబంధంగా నడుస్తున్న సింగరేణి కాలరీస్ కంపెనీ అన్నింటా తన ఆధిక్యతను చాటుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో బొగ్గు రవాణా, ఓవర్‌బర్డన్ తొలిగింపు, బొగ్గు ఉత్పత్తిలో గత ఏడాది ఇదే కాలానికి సాధించిన ప్రగతి చూస్తే లక్ష్యాలను దాటింది. నిరుడు జూన్‌లో 155,7 లక్షల టన్నుల రవాణా చేసింది, అయితే ఈ సంవత్సరం 168.76 లక్షల టన్నుల బొగ్గు రవాణాతో 8.4 శాతం వృద్ధి సాధించింది. అలాగే గత ఏడాది ఓవర్ బర్డన్‌లో 891 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డన్ రికార్డును ఈ ఏడు జూన్‌లో 1043 క్యూబిక్ మీటర్ల తొలగించి 19 శాతం వృద్ధితో రికార్డును సొంతం చేసుకుంది. గత యేడాది జూన్‌లో బొగ్గు ఉత్పత్తిలో 143.35 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన సంస్థ అదే ఈ యేడాది 145.63 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి 1.5 శాతం వృద్ధిని రికార్డుల్లో భద్రపర్చుకుంది.
నెలవారీ లక్ష్యాలను సాధించండి
- సీఎండీ శ్రీ్ధర్
ప్రస్తుతం వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంస్థ సీఎండీ శ్రీ్ధర్ ఉద్యోగ, కార్మికులకు సూచించారు. సింగరేణి అన్ని ఏరియాల్లో పని చేస్తున్న జిఎంలు తమ లక్ష్యాలను పూర్తి చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సిఎండి సూచించారు.

చిత్రం..జీఎస్‌టీ అవార్డు అందుకుంటున్న సింగరేణి సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్) ఎస్.శంకర్