బిజినెస్

నెలవారీ రెండువేలు భారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 2: ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో ఆరోగ్య కాంక్ష పెరుగుతోంది. ముఖ్యంగా తాము తినే ఆహారంపైనే తమ ఆరోగ్యం ఆధారపడి ఉంటుందన్న భావన రోజురోజుకూ బలపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి ఎరువులు లేకుండా పండించే సేంద్రీయ ఆహార పదార్థాలపై జనం దృష్టి పడింది. మిగతా ఆహార పదార్థాలతో పోలిస్తే సేంద్రీయ ఆహార పదార్థాలు ఆర్థికంగా భారాన్నివేసేవే అయినప్పటికీ ఇతరత్రా వీటివల్ల కలిగే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ రకమైన వాటిపైనే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. సేంద్రీయ ఆహార పదార్థాలను వినియోగించడం వల్ల ఆరోగ్య పరంగా ప్రజలకు కలిగే మేలుతో పాటు ఆర్థికంగా పడే భారమెంత అన్నదానిపై తాజాగా ఓ సర్వే జరిగింది. మామూలు ఆహార పదార్థాలకు బదులు సేంద్రీయ ఆహార పదార్థాలవైపు మళ్లితే ఓ కుటుంబంపై నెలకు 1200 నుంచి 1500 రూపాయల వరకూ ఆర్థికంగా అదనపు భారం పడుతుందని ఈ సర్వేలో స్పష్టమైంది. సహజంగానే సేంద్రీయ ఆహార పదార్థాల రేట్లు మిగతా వాటికంటే ఎక్కువగానే ఉంటాయి కాబట్టి తమ ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఈ అదనపు భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నారన్న సంకేతాలూ వ్యక్తమవుతున్నాయి. ప్రజల్లో పెరుగుతున్న ఆరోగ్య చైతన్యాన్ని ముఖ్యంగా సేంద్రీయ ఆహార పదార్థాల పట్ల పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తనవంతు చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతో ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ పదార్థాలను అందుబాటులో ఉండే ధరలకు లభించేలా చేయగలిగితే ఆరోగ్యానికి ఆరోగ్యం డిమాండ్‌కు డిమాండ్ అన్న పరిస్థితి బలపడుతుందని చెబుతున్నారు. అసోఛామ్, ఎర్న్స్‌అండ్ యంగ్ ఎల్‌ఎల్‌పి ఈ సర్వే నిర్వహించాయి. సేంద్రీయ ఆహార పదార్థాల రేట్లు ఎక్కువ కాబట్టి వీటిని సంపన్న ప్రాంతాలకే పరిమితం చేశారని, వీటి ధరల్ని తగ్గించగలిగితే మామూలు ప్రాంతాల్లోని ప్రజలు కూడా తమ ఆరోగ్యావసరాల దృష్ట్యా వీటికి అలవాటు పడే అవకాశం ఉంటుందని తెలిపారు. తక్కువ దిగుబడి, ప్రొసెసింగ్ సహా ఇతర అంశాల ఖర్చు ఎక్కువ కావడం, రైతులకు తగిన శిక్షణ వంటి వ్యయాల కారణంగా సేంద్రీయ పద్ధతిలో పండించే ఉత్పత్తుల ధరలు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చే సరికి ఆర్థికంగా భారగానే ఉంటాయని తెలిపారు. ఈ ఇతర ఖర్చును తగ్గించేందుకు ప్రభుత్వ పరంగా తగిన చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని సర్వే స్పష్టం చేసింది. పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడం కూడా వీటి ధరలు అధికంగా ఉండటానికి మరోకారణమని తెలిపారు. అయితే కేంద్రం, రాష్ట్రాలు, ప్రైవేటు సంస్థలు వీటిపై దృష్టి పెట్టినా సరైన నియంత్రణ యంద్రాంగం లేకపోవడం వల్ల వినియోగదారుడికి అందుబాటులోకి వచ్చే సరికి వీటి రేట్లు పెరిగిపోతున్నాయని తెలిపింది. సరైన సబ్సిడీ ప్రోత్సాహం లేకపోవడం, అన్ని దశల్లోనూ ప్రామాణికత లోపించడం కూడా డిమాండ్-సరఫరాల మధ్య వ్యత్యాసానికి కారణమవుతోందని సర్వేలో వెల్లడైంది. సేంద్రీయ రంగం పూర్తి స్థాయి సామర్థ్యాన్ని సంతరించుకునే రీతిలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంపొందించాలని, ఈ విషయంలో అనేక రకాలుగా అయోమయ స్థితిలో ఉన్న రైతులకు తగిన శిక్షణ అందించడం ద్వారా వారిలో నైపుణ్యాన్ని మెరుగుపరచాలని సూచించింది. పెట్టుబడుల లభ్యతతో పాటు ఇతరత్రా అన్ని విధాలుగా ప్రోత్సాహాలను అందించగలిగితే సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చే విధంగా సేంద్రీయ పదార్ధాల ఉత్పాదకతను పెంపొందించే అవకాశం ఉంటుందని తెలిపింది.