బిజినెస్

మార్కెట్ల ఊగిసలాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, జూలై 2: ఓ పక్క విదేశీ పెట్టుబడులు తరలిపోవడం, మరోపక్క అంతర్జాతీయ వాణిజ్యంలో చోటుచేసుకుంటున్న ఒడిదుడుకులు సోమవారం భారత మార్కెట్ లావాదేవీలపై తీవ్ర ప్రభావం కనబరిచాయి. ఈ స్లంప్ పరిస్థితుల్ని ప్రతిబింబిస్తూ ఇనె్వస్టర్లు కూడా తీవ్ర స్థాయిలో అమ్మకాలకు పాల్పడ్డారు. సెనె్సక్స్, నిఫ్టీలు నష్టాలతోనే ముగిశాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ 159 పాయింట్లు కోల్పోయి 35,264.41 వద్ద ముగిస్తే, నిఫ్టీ 57పాయింట్లు కోల్పోయి 10,700వద్ద ముగిసింది. ఈ వారంలోనే అమెరికా వాణిజ్య సుంకాలను చైనాపై విధించే అవకాశం ఉండటం కూడా అంతర్జాతీయ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ముఖ్యంగా ఆసియా మార్కెట్లు తీవ్ర స్థాయిలో కల్లోలానికి లోనయ్యాయి. దేశీయ మార్కెట్‌లలో మదుపుదారులు లాభాల స్వీకరణకు ప్రాధాన్యతనివ్వడం, డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి విలువ మరింత తగ్గిన ప్రభావం తీవ్రంగానే కనిపించింది. ఈ పరిస్థితుల్లో బిఎస్‌ఇ టెలికాం ఇండెక్స్ గణనీయంగా పడిపోయింది. దీని షేర్ల విలువ 2.61శాతం మేర పతనమైంది. లావాదేవీల ప్రారంభంలో సెనె్సక్స్ సానుకూలంగానే కొనసాగినా,దేశీయ సంస్థాగత ఇనె్వస్టర్ల కొనుగోళ్ల బలంతో కొంత మేర పుంజుకున్నప్పటికీ క్షణాల్లో అమ్మకాల వత్తిడికి లోనైంది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉండటం కూడా ప్రపంచ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని కనబరిచిందని విశే్లషకులు తెలిపారు. కాగా నేటి లావాదేవీల్లో నష్టపోయిన కంపెనీల్లో ఎన్‌టిపిసి, భారతీ ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్స్, హెచ్‌డిఎఫ్‌సి, ఓఎన్‌జిసి, కోల్ ఇండియా, ఎల్ అండ్ టి, రిల్, టాటా స్టీల్, ఐటిసి మొదలైనవి ఉన్నాయి. స్వల్పంగా పుంజుకున్న కంపెనీల్లో ఆసియా పెయింట్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్,బజాజ్ ఆటో మొదలైన కంపెనీలు ఉన్నాయి. డాలర్‌తో రూపాయి మారక విలువ తగ్గడంతో ఐటి షేర్లకు డిమాండ్ పెరిగింది.