బిజినెస్

ప్రాంతీయ వాణిజ్యమే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అంతర్ ప్రాంతీయ వాణిజ్యం లేకపోవడం వల్లే దక్షిణాసియా ఆర్థికాభివృద్ధి వెనుకబడిందని నీతి ఆయోగ్ సీఇఓ అమితాబ్ కాంత్ అన్నారు. ఈ ప్రాంతంలోని దేశాల మధ్య అన్ని విధాలుగా పరస్పర సహకారం పెరగాల్సిన అవసరం ఎంతో ఉందని, ముఖ్యంగా పరస్పర పెట్టుబడులు విస్తరించడంతో పాటు పర్యాటక రంగం కూడా గణనీయంగా అభివృద్ధి చెందితేనే ఈ ప్రాంతం అభివృద్ధి పరంగా వేగాన్ని పుంజుకోగలుగుతుందని తెలిపారు. మొదటి నుంచీ కూడా దక్షిణాసియా దేశాలు పరస్పర వ్యాపార, వాణిజ్య అంశాలపై సరైన దృష్టి పెట్టక పోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపారు. టూరిజం, పెట్టుబడులు ఈ దేశాల మధ్య ఎంతగా విస్తృతమైతే అంతగానూ ఆర్థిక అభివృద్ధి బలాన్ని సంతరించుకునే అవకాశం ఉంటుందని ఉద్ఘాటించారు.అమెరికా నుంచే ఐరోపా నుంచో దక్షిణాసియా ఆర్థిక వృద్ధికి అవకాశాలు తరలివచ్చే అవకాశం లేదని పేర్కొన్న ఆయన ఈ ప్రాంతంలోని దేశాల మధ్య రాజకీయ చిత్తశుద్ధి, పరస్పరం సహకరించుకోవడం వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందన్న బలమైన ఆకాంక్ష ప్రస్ఫుటించాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. ఈ సహకార ధోరణి వల్ల అభివృద్ధి వేగం పెరగడంతో పాటు ఈ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న పేదరికాన్ని కూడా తరమికొట్టడం సాధ్యమవుతుందన్నారు. రాజకీయ నాయకులు ఏమి చెప్పినా, ఈ ప్రాంత రాజకీయాలు ఎలా ఉన్నా వాస్తవం మాత్రం అభివృద్ధి రాహిత్య పరిస్థితి తాండవించడమేనని అమితాబ్ కాంత్ తెలిపారు. ఈ దేశాల ధోరణిలో మార్పు రానంత వరకూ వ్యాపార, వాణిజ్య, టూరియం వంటి రంగాల్ని అభివృద్ధి చేసేందుకు గట్టి చర్యలు చేపట్టనంత వరకూ ఇక్కడి పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశమే ఉండదని తేల్చిచెప్పారు. ముఖ్యంగా ఈ దేశాలు తమ వ్యక్తిగత అభివృద్ధితో పాటు దక్షిణాసియాను ఓ ప్రాంతంగా పరిగణించి దాని సమగ్ర అభివృద్ధికి విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టడం అత్యవసరమని ఉద్ఘాటించారు. ఇందుకు ప్రధానంగా కావాల్సింది ఈ దేశాలన్నీ వ్యాపార, వాణిజ్య, పెట్టుబడులకు సంబంధించి మరింతగా సహకారం, సయోధ్యను పెంపొందించుకోవడమేనని స్పష్టం చేశారు. సార్క్ అభివృద్ధి నిధి భాగస్వామ్య సదస్సును ఉద్దేశించి మాట్లాడిన నీతి ఆయోగ్ సీఇఓ ‘ ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక రంగం అభివృద్ధి అన్నది అంతర్ ప్రాంతీయమే. అంతే ఆయా ప్రాంతాల్లోని దేశాల మధ్యే పరస్పరం ప్రజల పర్యటనలు జరుగుతాయి. ఎక్కడో ఉన్న దేశానికి ఎప్పుడోగాని సుదూర ప్రాంత ప్రజలు వచ్చే అవకావశం ఉండదు’అని అన్నారు. ఇందుకు అమెరికా, ఐరోపా దేశాలే నిదర్శనమని, అక్కడ పర్యాటక రంగం, వాణిజ్యం పూర్తిగా అంతర్ ప్రాంతీయమేనని అన్నారు. కానీ, ప్రపంచంలో ఎక్కడా లేని పరిస్థితి దక్షిణాసియా దేశాల మధ్య ఉందని, ఎంత దగ్గరో అంత దూరం అన్న చందంగా ఈ దేశాల మధ్య వ్యాపార, వాణిజ్యం, పర్యాటకరంగం, పెట్టుబడుల పరిస్థితి ఉందని తెలిపారు. ఈ దేశాలు సంఘటితం అయితే తప్ప మిగతా ప్రాంతాలతో పోటీగా అభివృద్ధి చెందే అవకాశమే ఉండదన్నారు.