బిజినెస్

రిల్ చైర్మన్‌గా ముకేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 7: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా ముకేశ్ అంబానీ మరో అయిదేళ్ల పాటు కొనసాగడానికి ఆ కంపెనీ వాటాదారులు ఆమోదం తెలిపారు. 61 ఏళ్ల అంబానీ 1977 నుంచి రిల్ బోర్డులో కొనసాగుతున్నారు. రిలయన్స్ గ్రూప్ అధినేత, తన తండ్రి ధీరూభాయ్ అంబానీ 2002 జూలైలో కన్నుమూసిన తరువాత ముకేశ్ రిల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. రిల్ చైర్మన్‌గా ముకేశ్ అంబానీ గడువు 2019 ఏప్రిల్ 19తో ముగియబోతోంది. ఈ నేపథ్యంలో ముకేశ్ అంబానీని మరో అయిదేళ్ల కాలానికి సీఎండీగా తిరిగి నియమిస్తూ కంపెనీ జూలై అయిదో తేదీన జరిగిన వార్షిక జనరల్ మీటింగ్‌లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మెజారిటీ వాటాదారులు ముకేశ్ అంబానీని తిరిగి సీఎండీగా నియమిస్తూ ప్రతిపాదించిన తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారని రిల్ నియంత్రణ సంస్థలకు సమర్పించిన పత్రంలో వెల్లడించింది. పోలయిన మొత్తం ఓట్లలో 98.5 శాతం తీర్మానానికి అనుకూలంగా పడగా, 1.48 శాతం వ్యతిరేకంగా పడ్డాయని ఆ కంపెనీ వివరించింది. వాటాదారులు ఆమోదించిన తీర్మానం ప్రకారం ముకేశ్ అంబానీ వార్షిక వేతనం కింద రూ.4.17 కోట్లు, ఇతర అలవెన్సుల కింద రూ.59 లక్షలు పొందుతారు. అయితే, రెమ్యునరేషన్ సీలింగ్‌లో పదవీ విరమణ అనంతరం పొందే ప్రయోజనాలను చేర్చలేదు. ముకేశ్ అంబానీ కంపెనీ నికర లాభం ఆధారంగా బోనస్‌ను, కంపెనీ వ్యాపారం నిమిత్తం చేసే ప్రయాణాలకు సంబంధించి ప్రయాణ, బోర్డింగ్, లాడ్జింగ్‌లకు అయ్యే వ్యయాన్ని కూడా పొందుతారు. ముకేశ్‌కు కంపెనీ కార్లను కూడా సమకూరుస్తుంది. అంబానీ ఇంటినుంచి జరిపే కమ్యూనికేషన్‌కు సంబంధించిన వ్యయాన్ని కూడా కంపెనీ తిరిగి చెల్లిస్తుంది. ఇది భత్యం కిందకు రాదని కంపెనీ ఆ పత్రంలో వివరించింది.