బిజినెస్

ద్రవ్యోల్బణం పెరగొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 8: కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను పెంచాలని తీసుకున్న నిర్ణయం ప్రభావం దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)పై 0.1 శాతం నుంచి 0.2 శాతం వరకు ఉంటుందని, ద్రవ్యోల్బణం ఒత్తిడులను కూడా పెంచుతుందని ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజం డీబీఎస్ తన నివేదికలో పేర్కొంది. అధిక కనీస మద్దతు ధరల వల్ల ద్రవ్యోల్బణంతో పాటు ఆర్థిక వ్యయం పెరుగుతుందని ఆ నివేదిక వివరించింది. ‘ఆర్థిక గణాంకాల రీత్యా చూస్తే పంటల కనీస మద్దతు ధర పెరుగుదల ప్రభావం జీడీపీపై 0.1-0.2 శాతం వరకు ఉంటుంది. 2018-19 సంవత్సర ఆర్థిక లోటు రిస్క్‌ను తగ్గించుకోవడానికి రెవెన్యూ మద్దతును పెంచుకోవడమో లేదా క్యాపిటల్ వ్యయాన్ని (క్యాపెక్స్) తగ్గించుకోవడమో చేయవలసిన పరిస్థితిని ఇది కల్పిస్తోంది’ అని డీబీఎస్ ఒక పరిశోధన నివేదికలో పేర్కొంది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రైతులపై ఒత్తిడిని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల 4న వరి కనీస మద్దతు ధరను రికార్డు స్థాయిలో క్వింటాలుకు రూ. 200 చొప్పున పెంచింది.