బిజినెస్

ఏపీలో పెట్టుబడులపై పెరిగిన ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 8: రాష్ట్రంలో నిర్వహిస్తున్న సదస్సులు, విదేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలు సత్ఫలితాలిస్తున్నాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆయా కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు నిరంతరం అందుబాటులో ఉంటూ పెట్టుబడులు రాష్ట్రంలో ప్రవహించేలా చేస్తున్నారు. పెట్టుబడులకు సంబంధించి నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో దాదాపు 30శాతం మేర కార్యరూపం దాల్చడం విశేషం. రాష్ట్ర విభజన జరిగాక ఎదురైన సవాళ్లను అవకాశంగా మార్చుకుని పెట్టుబడులకు స్వర్గ్ధామంగా ఏపీని సీఎం తయారు చేశారు. సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూనే అంతర్జాతీయంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని అభివృద్ధికి బాటలు వేసేందుకు సీఎం చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలు ఇస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, దావోస్, సింగపూర్, అరబ్ దేశాల్లో పర్యటనల ఫలితంగా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు ప్రపంచం దృష్టికి వచ్చాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ అవలంబిస్తున్న విధానాల కారణంగా భవిష్యత్తు మెరుగ్గా ఉంటుందన్న విశ్వాసాన్ని కల్పించారు. పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చినవారితో నిరంతరం చర్చలు జరుపుతూ వారికి ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా వాతావరణాన్ని సుగమం చేసేందుకు అధికారుల నియామకం, వివిధ పాలసీల రూపకల్పన వంటి ప్రత్యేక వ్యూహాలు పెట్టుబడులకు ఊతం ఇస్తున్నాయి. కియా మోటార్స్, గూగుల్ ఎక్స్, హెచ్‌సీఎల్, ఫ్లెక్స్‌ట్రానిక్స్, తదితర ప్రముఖ సంస్థలు ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం గమనార్హం. చైనా, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్ దేశాల్లో నిర్వహించిన రోడ్‌షోల ఫలితంగా దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల మేర పెట్టుబడులు, 500 కోట్ల రూపాయలతో తమ ప్రాజెక్టుల కార్యకలాపాలు ప్రారంభించాయి. సింగిల్ విండో విధానం కూడా పారిశ్రామికవేత్తలకు ఉపయుక్తంగా ఉంటోంది. గత మూడేళ్లలో వివిధ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి జరిగిన అవగాహన ఒప్పందాల్లో దాదాపు 30శాతం మేర కార్యరూపం దాల్చాయి. దాదాపు 16లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకొచ్చాయి. పరిశ్రమలు, వౌలిక సదుపాయాలు, సాంప్రదాయేతర ఇంధన వనరులు, ఆహార శుద్ధి, ఉన్నత విద్య, ఐటీ, గనులు, రహదాలులు, భవనాలు, పర్యాటక రంగాల్లో ఇప్పటివరకూ 1.48 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో 721 ప్రాజెక్టులు ఉత్పత్తి ప్రారంభించాయి. 31 ప్రాజెక్టులు ట్రయల్ రన్ ప్రారంభించగా, 64 యూనిట్లు యంత్ర సామగ్రిని అమర్చాయి. ఈ రెండు కేటగిరీల కింద దాదాపు 93వేల కోట్ల రూపాయలు మేర పెట్టుబడులు వచ్చాయి. గతంలో జరిగిన ఒప్పందాలను కార్యరూపం దాల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రాష్ట్ర ప్రగతికి మరింతగా ఊతమివ్వన్నాయి.