బిజినెస్

ఆర్థికాభివృద్ధి ఉన్నా, అపసవ్య దిశలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత్‌లో అర్థికాభివృద్ధి వేగంగా జరుగుతున్నా, అది అపసవ్య దిశలో ప్రయాణిస్తోందని నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థిక శాస్తవ్రేత్త అమర్త్యసేన్ అన్నారు. 2014 నుంచి అభివృద్ధి నమోదవుతున్నా, అది ప్రతికూల దిశ నడుస్తోందన్నారు. దీని పర్యవసానం వల్ల మంచి ఫలితాలు రావన్నారు. దక్షిణాసియాలో ఆర్థికంగా బాగా దెబ్బతిన్న దేశాల్లో రెండవ దేశం భారత్ అని ఆయన అన్నారు. ఆదివారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో అనిశ్చిత స్థితిలో భారత్ ఆర్థిక రంగం అనే పుస్తకం హిందీ ఎడిషన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాగాదెబ్బతిన్న ఆర్థికవ్యవస్థ కలిగి ఉన్న దేశాల్లో శ్రీలంక మొదటి స్థానంలో ఉందన్నారు. అమానతలకు గురైన ప్రజలు, కుల వ్యవస్థలోని కులాలు, గిరిజనులను అభివృద్ధిలో భాగస్వాములను చేయలేనందు వల్ల ఆర్థిక రంగం విపత్కర పరిణామాలకు గురవుతోందన్నారు. ఇప్పటికీ దేశంలో మరుగుదొడ్లను, డ్రైనేజీలను తమ చేతులతో మరమ్మత్తులు చేసే వారున్నారని, వారి అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలేమున్నాయని ఆయన ప్రశ్నించారు. వారిని నిర్లక్ష్యం చేశారన్నారు. మధ్యప్రదేశ్‌లో వేతనం పెంచాలని అడిగిన ఒక దళిత యువకుడిని పెట్రోలు బంకు యజమాని అవమానించారని, దళితులు, బలహీనవర్గాలకు మంచి విద్య, వైద్య సేవలు ఇంకా అందని ద్రాక్షపండులా మిగిలాయన్నారు. అణగారిన వర్గాలను విస్మరించడం వల్ల అభివృద్ధి జరగదన్నారు. స్వాతంత్య్రసమరపోరాటం తర్వాత హిం దూ ఓటు బ్యాంకుతో ఎన్నికల్లోగెలవడం జరగదనుకున్నామన్నారు. కాని ఇప్పుడు వాతావరణం మారిందని ఆయన బీజేపీపై ధ్వజమెత్తారు. ఈ రోజు ప్రతిపక్షాలు విబేధాలను విస్మరించి ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇదేదో రాహుల్ వర్సెస్ మోదీగా భావించరాదని, యావత్తు భారత్ భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఆలోచించాలన్నారు. ఈ సమవాశంలో ఆర్థికవేత్త జేన్ డ్రెజ్ మాట్లాడుతూ, కేంద్రం త్వరలో ప్రవేశపెట్టను న్న ఆయుష్మాన్ ఆరోగ్య బీమా పథకం బూటకమన్నారు. ఇదేమీ గొప్ప స్కీం కాదన్నారు.
ఈ ఏడాది ఈ స్కీంకు కేవలం రూ.2వేల కోట్లను కేటాయించారన్నారు. ఒక వ్యక్తికి రూ.20 కంటే తక్కువ ఖర్చుపెట్టే విధంగా స్కీంను రూపొందించారన్నారు. కాని 50 కోట్ల మంది భారతీయులకు మహాద్భుతమైన ఆరోగ్య బీమా పథకాన్ని అందిస్తున్నామని బీజేనీ నేతలు కబుర్లు చెప్పుకుంటున్నారన్నారు. ఆరోగ్య బీమా పథకం ఒక డొల్ల పథకమని, ఇందులో ఏమీ లేదని అన్నారు. ఈ ఆర్థిక వేత్త గతంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ స్కీంను రూపొందించిన విషయం విదితమే.