బిజినెస్

ఎగుమతి, దిగుమతులపై పెరిగిన ఆంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 9: జి 20లో సభ్యత్వం ఉన్న భారత్, అమెరికా సహా పలు దేశాలు తమ ఎగుమతి, దిగుమతులపై అధిక పన్నులు, డ్యూటీలు విధింపు లాంటి 39 వాణిజ్య ఆంక్షలు విధించాయని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటివో) వెల్లడించింది. గత ఏడు నెలల నుంచి మే వరకు ఈ దేశాలు ఇతరదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై కస్టమ్స్ పరంగా కూడా పలు నిబంధనలు విధించినట్టు తెలిపింది.
అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య వాణిజ్య సంబంధాల మెరుగుకు జి 20 గ్రూపు కృషి చేస్తోంది. ఇందులో ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, యూరప్ యూనియన్, జర్మనీ, జపాన్, కొరియా, రష్యా, సౌత్ ఆఫ్రికా, టర్కీ తదితరమైనవి సభ్యదేశాలుగా ఉన్నాయి. గతంలో నిర్వహించిన సమీక్షతో పోలిస్తే ఈసారి వాణిజ్య ఆంక్షలు పెరిగినట్టు డబ్ల్యుటివో డైరెక్టర్ జనరల్ రాబర్టో అజెవెడో తెలిపారు. ఈ విధమైన ఆంక్షలు వాణిజ్యపరంగా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని ఆయన చెప్పారు.
అలాగే దేశాల మధ్య వాణిజ్యసంబంధాలు దెబ్బతినే ప్రమాదముందని అన్నారు. ఇటీవల కాలంలో అమెరికా చైనా మధ్య జరుగుతున్న వాణిజ్యయుద్ధం భారత్‌కు ఏమంత క్షేమం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 2011-12లో భారత్ 300 బిలియన్ యూఎస్ డాలర్ల ఉత్పత్తి చేయగా, 2017-18లో 303 బిలియన్లకు చేరిందన్నారు. ఇలావుండగా దేశాల మధ్య వాణిజ్య సంబంధాల మెరుగుకు జి20 ఇటీవల 47రకాల చర్యలు తీసుకుందని చెప్పారు. ఇందులో టారిఫ్‌ల తగ్గింపు, ఎగుమతి దిగుమతుల్లో కస్టమ్స్ విధానాల సరళీకరణ, పన్నుల తగ్గింపు వంటివి ఉన్నట్టు తెలిపారు.