బిజినెస్

తెలంగాణలో ప్రపంచ స్థాయి పరిశ్రమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, జూలై 9: ప్రపంచ స్థాయి పారిశ్రామీకరణను ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలంగాణ పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. సరళీకృత విధానాలతో దేశంలోనే ఎక్కడా లేని విధంగా పరిశ్రమల ఏర్పాటుకు అవసమైన సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందిస్తున్నామన్నారు. సంగా రెడ్డి జిల్లా పటన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో సుమారు 104కోట్ల రూపాయల వ్యయంతో కాలుష్య జలాల శుద్ధీకరణ కర్మాగార నిర్మాణ పనులను ఆయన సోమవారం భూమిపూజ చేసి ప్రారంభించారు. తెలంగాణలోని యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు మరుగు పరచడానికి భారీ స్థాయి పరిశ్రమలతో పాటు చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటు అవసరమన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో పాటు పర్యావరణ పరిరక్షణకు అంతే స్థాయిలో ప్రాధాన్యం ఇస్తున్నామని ఈ సందర్బంగా ఆయన వివరించారు. గ్రేటర్ హైద్రాబాద్ మహానగరం పరిధిలోని కాలుష్యకారక పరిశ్రమలను తరలించాలని గత ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసిందన్నారు. జల, వాయు కాలుష్య నివారణకు ఇదొక్కటి మాత్రమే మార్గం కాదని ట్రీట్‌మెంట్ ప్లాంటు ను ఏర్పాటు చేయడం ద్వారా ఆయా ప్రాంతాలలో నెలకొన్న విషపూరితమైన వాతావరణాన్ని నివారించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తెలంగాణలో 1122 రసాయన పరిశ్రమలను రెడ్ అండ్ ఆరెంజ్ పరిశ్రమలుగా గుర్తించడం జరిగిందన్నారు. వాటిని భాగ్యనగర పరిసరాల నుండి తరలించడానికి ఓ బృహత్తరమైన ప్రణాళిక రూపొందించామన్నారు. ప్రపంచస్థాయి వౌలిక వసతులు కల్పించడం ద్వారా హైద్రాబాద్ ఫార్మాసిటీ పారిశ్రామిక ప్రాంతం నుండి 283 పరిశ్రమలను తరలిస్తామన్నారు. కాలుష్యకారక రసాయన పరిశ్రమలను తరలించడానికి కొంత సమయం మాత్రం ఇస్తామని, పర్యావరణానికి విఘాతం కలిగించే యాజమాన్యాలను ఎట్టి పరిస్థితులోను వదలమని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. పరిసరాల వాతావరణాన్ని పాడు చేస్తూ ప్రజలకు ఆరోగ్యానికి విఘాతం కలిగించే వాటిపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని, అవసరమైనప్పుడు వాటిని మూసి వేయడానికి కూడ వెనుకాడమన్నారు.
ఎమ్మెల్యే మహీపాల్‌రెడ్డి మాట్లాడుతూ పాశమైలారం పారిశ్రామికవాడకు బైపాస్ రహదారి నిర్మాణానికి మంత్రి కేటీఆర్ సహకరించాలని కోరారు. 45 కోట్ల రూపాయలు మంజూరైనాయని, భూ సేకరణ మాత్రమే మిగిలి ఉందన్నారు. ఎమ్మెల్యే కోరిక మేరకు స్పందించిన మంత్రి కేటీఆర్ భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని సంగారెడ్డి ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డికి ఆదేశాలు జారీ చేసారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి, పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు బాలమల్లు, నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఎమ్మెల్యే యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

చిత్రాలు..కాలుష్య శుద్ధి కర్మాగారానికి శంకుస్థాపన అనంతరం మాట్లాడుతున్న మున్సిపల్,
పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, సభకు హాజరైన పారిశ్రామికవేత్తలు, నాయకులు