బిజినెస్

ఫిక్కీ తెలంగాణ, ఏపి చైర్మన్లుగా సురానా, ప్రభాకరరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 3: ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ (్ఫక్కీ) తెలంగాణ మండలి చైర్మన్‌గా భాగ్యనగర్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దేవేంద్ర సురానా, ఆంధ్రప్రదేశ్ మండలి చైర్మన్‌గా ఎన్‌ఎస్‌ఎల్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎం ప్రభాకరరావు ఎన్నికయ్యారు. వీరిరువురు సోమవారం ఇక్కడ జరిగే ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఫిక్కీ జాతీయ స్థాయిలో కార్యవర్గ సమావేశాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. కాగా, సురానా మాట్లాడుతూ పరిశ్రమల రంగానికి సేవలు అందించే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. విధానాల మార్పు కోసం ప్రయత్నిస్తానని, పరిశ్రమల రంగం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రభాకరరావు మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశం సందర్భంగా తెలంగాణ పరిశ్రమల విధానంపై జరిగే సదస్సులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ, ఐటి శాఖ మంత్రి కెటిఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తదితన ఉన్నతాధికారులు పాల్గొంటారు.
చిత్రాలు దేవేంద్ర సురానా, ప్రభాకరరావు