బిజినెస్

ప్రజల సొమ్ముతో వాటాలు కొంటారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 10: జాతీయ బ్యాంకు ఐడీబీఐలో 52 శాతం వాటా తీసుకోవాలన్న బీమా యాజమాన్యం ప్రతిపాదనలు జీవిత బీమా ఉద్యోగుల యూనియన్ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రీమియంల కింద రూపాయి రూపాయి కూడబెట్టిన సొమ్ములు వాటాల కొనడాని ఉపయోగించడం అంటే ఖాతాదారుల ప్రయోజనాలను దెబ్బతీయడమేనని ఎల్‌ఐసీ క్లాస్-1 అధికారుల అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు (పీఎస్‌బీలు)లో పెట్టిన పెట్టుబడులు సంగతి ఏమైందీ గుర్తులేదా? అని అసోసియేషన్ నిలదీసింది. బ్యాంకుల పనితీరు కోతల ప్రభావం షేర్ విలువపై పడుతుందని తద్వారా బీమాపైనా ప్రతికూల ప్రభావం ఉంటుందని ఉద్యోగులు హెచ్చరించారు. అందువల్ల ఐడీబీఐలో అత్యధిక వాటా కొనాలన్న ఆలోచన ఉపసంహరించుకోవాలని అఖిల భారత జీవిత బీమా ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి రాజేష్ కుమార్ డిమాండ్ చేశారు. 2014-15 సంవత్సరంలో పీఎస్‌బీల్లో జీవిత బీమా సంస్థ 1,850 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టింది. 2015-16లో 2,539 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినట్టు ఎల్‌ఐసీ చైర్మన్‌కు రాసిన లేఖలో తెలిపారు. ప్రస్తుతం ఐడీబీఐలో బీమా సంస్థ 11 శాతం వాటాలు కలిగి ఉంది. మొత్తంగా బ్యాంకు గత మార్చిమాసానికి సంబంధించి నిరర్ధక ఆస్తులు 55,588 కోట్లని కుమార్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఏ ప్రైవేటు పెట్టుబడిదారు ఐడీబీఐ అంటే సదాభిప్రాయం లేదని, అంతెందుకు ప్రభుత్వమే ఈక్విటీ అమ్మేయడానికి రెండేళ్లుగా ప్రయత్నిస్తోందని ఫెడరేషన్ నాయకుడు తెలిపారు. ఐడీబీఐ ఎన్‌పీఏలో ఇలాంటి అనిశ్చిత పరిస్థితులు ఉన్నందున పెట్టుబడులు పెట్టాలన్న ప్రతిపాదన రిస్క్‌తో కూడుకున్నదేనని ఆయన చెప్పారు. అందువల్ల ఎల్‌ఐసీ పాలసీదారులు, విలువైన పొదుపును పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందన్న విషయం బీమా సంస్థ మరిచిపోకూడదని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. పాలసీల మీద బీమా పెంపునకు సంబంధించి గత కొనే్నళ్లుగా జీవిత బీమా సంస్థ తర్జనభర్జన పడుతోందని యూనియన్ ప్రధాన కార్యదర్శి అన్నారు. ఇలాంటి అనేక అంశాలతో చైర్మన్‌కు ఉద్యోగుల సంఘం లేఖ రాసింది. ‘మార్చి నెలాఖరునాటికి బ్యాంక్ నికర నష్టం 5,663 కోట్లు’ అని ఆయన స్పష్టం చేశారు. అలాగే బీమా చట్టాలు (సవవరణ చట్టం) 2015 ప్రకారం ఏ బీమా సంస్థ కూడా (ఎల్‌ఐసీతోపాటు) ఒక కంపెనీలో 15 శాతం కంటా వాటా కొనడానికి వీల్లేదని స్పష్టంగా ఉందని రాజ్‌కుమార్ వెల్లడించారు.