బిజినెస్

రూ.పది లక్షల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 10: దీపక్ పరేఖ్ నేతృత్వంలోని ఆర్థిక సేవల దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌నకు చెందిన లిస్టయిన సంస్థల మార్కెట్ విలువ (ఎంక్యాప్) మంగళవారం రూ. పది లక్షల కోట్ల మైలురాయిని దాటింది. టాటా గ్రూప్ ఇప్పటికే ఈ ఘనతను సాధించగా, హెచ్‌డీఎఫ్‌సీ ఈ ఘనత సాధించిన రెండో భారతీయ వాణిజ్య సంస్థగా నిలిచింది. హెచ్‌డీఎఫ్‌సీ ప్రస్తుతం నాలుగు లిస్టయిన అనుబంధ సంస్థలను కలిగి ఉంది. అవి హౌసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, బ్యాంకింగ్ సేవల విభాగం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, జీవిత బీమా సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ స్టాండార్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, గృహ్ ఫైనాన్స్. మరోవైపు టాటా గ్రూప్‌నకు చెందిన సుమారు 30 సంస్థలు స్టాక్ ఎక్స్చేంజ్‌లో లిస్టయి ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీకి చెంది మరో సంస్థ, దాని మ్యూచువల్ ఫండ్ విభాగం ప్రస్తుతం ఐపీఓను ప్రారంభించే ప్రక్రియ చేపట్టింది. అది పూర్తయితే హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ లిస్టయిన సంస్థల సంఖ్య అయిదుకు పెరుగుతుంది. ఈ అయిదో సంస్థ మార్కెట్ విలువ సుమారు రూ. 30వేల కోట్ల వరకు ఉంటుందనేది నిపుణుల అంచనా. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీలో మంగళవారం లావాదేవీలు ముగిసే సమయానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 5,59,633.53 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ మార్కెట్ విలువ రూ. 3,26,776.81 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ స్టాండార్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మార్కెట్ విలువ రూ. 95,936.72 కోట్లు, గృహ్ ఫైనాన్స్ మార్కెట్ విలువ రూ. 24,967.71 కోట్లుగా ఉంది. టాటా గ్రూప్‌నకు చెందిన సంస్థల మొత్తం మార్కెట్ విలువ సుమారు రూ. 11 లక్షల కోట్లు ఉంది.