బిజినెస్

ప్యాసింజర్ వాహనాలదే హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 10: దేశంలో జూన్ నెలలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 37.54 శాతం వృద్ధితో పెరిగాయి. సుమారు పదేళ్ల కాలంలో ఒక నెలలో అమ్మకాల వృద్ధి ఇంత ఎక్కువగా నమోదు కావడం ఇదే మొదటిసారి. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు తరువాత వాహనాల ధరలు తగ్గుతాయని భావించిన కస్టమర్లు నిరుడు జూన్ నెలలో వాహనాల కొనుగోలును వాయిదా వేసుకోవడం కూడా ఇప్పుడు అమ్మకాల వృద్ధి రేటు బాగా పెరగడానికి దోహదపడింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (ఎస్‌ఐఏఎం) విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో ప్యాసింజర్ వెహికిల్స్ (పీవీ) అమ్మకాలు 2,73,759 యూనిట్లకు పెరిగాయి. ఈ వాహనాలు నిరుడు జూన్‌లో 1,99,036 యూనిట్లు అమ్ముడుపోయాయి. అంతకు ముందు 2009 డిసెంబర్‌లో ప్యాసింజర్ వెహికిల్స్ విక్రయాలు అత్యంత వేగంగా 50 శాతం వృద్ధి చెందాయి. దేశంలో కార్ల విక్రయాలు 2017 జూన్‌లో 1,37,012 యూనిట్లు కాగా, ఈ సంఖ్య ఈ సంవత్సరం జూన్‌లో 34.21 శాతం వృద్ధితో 1,83,885 యూనిట్లకు పెరిగింది. నిరుడు జూలై ఒకటో తేదీన జీఎస్‌టీ అమలులోకి వచ్చిన తరువాత వాహనాల ధరలు తగ్గుతాయనే అంచనాతో కస్టమర్లు జూన్‌లో వాహనాల కొనుగోలును వాయిదా వేశారని, అందువల్ల అప్పుడు వాహనాల విక్రయాలు తగ్గాయని, అందువల్ల ఈ సంవత్సరం జూన్‌లో వాహనాల అమ్మకాల వృద్ధి రేటు బాగా పెరిగిందని తాము భావిస్తున్నామని ఎస్‌ఐఏఎం డైరెక్టర్ జనరల్ విష్ణు మాథుర్ ఇక్కడ విలేఖరులకు చెప్పారు. క్రితం సంవత్సరం జూన్‌తో పోలిస్తే ఈ సంవత్సరం జూన్‌లో యుటిలిటి వాహనాల విక్రయాలు 47.11 శాతం, కార్ల విక్రయాలు 34.21 శాతం, వ్యాన్ల విక్రయాలు 35.64 శాతం చొప్పున పెరిగాయని ఆయన వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాలు క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 19.91 శాతం వృద్ధితో 8,73,501 యూనిట్లకు పెరిగాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 7,28,483 యూనిట్లు అమ్ముడుపోయాయి.
అధిక విక్రయాలు మారుతి సొంతం
మార్కెట్ లీడర్ మారుతి సుజుకి ఇండియా దేశీయంగా ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాలలో 44.4 శాతం వృద్ధితో 1,34,036 యూనిట్లను విక్రయించింది. దాని ప్రత్యర్థి హ్యుందాయి మోటర్ ఇండియా 20.79 శాతం వృద్ధితో 45,371 యూనిట్లను విక్రయించింది. మహీంద్ర అండ్ మహీంద్ర 11.89 శాతం వృద్ధితో 18,092 వాహనాలను, టాటా మోటార్స్ 56.75 శాతం వృద్ధితో 20,610 వాహనాలను విక్రయించింది.