బిజినెస్

రాష్ట్రాల రెవెన్యూకు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 12: ఉద్యోగుల వేతనాలు, రైతుల రుణమాఫీ, జీఎస్‌టీలో రెవెన్యూ తగ్గుదల వల్ల రాష్ట్రాల ద్రవ్యలోటు 2017-18 సంవత్సరంలో 0.35 శాతం మేర తగ్గి 3.1 శాతానికి చేరుకుందని ఆర్‌బీఐ పేర్కొంది. వరుసగా మూడో ఏడాది కూడా రాష్ట్రాల స్థూల ద్రవ్యలోటులో నుంచి బయటకు రాలేకపోతున్నాయని ఆర్‌బీఐ పేర్కొంది.
సవరించిన అంచనాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 0.4 శాతం మేర రెవెన్యూ లోటును కోలుకుని, 0.2 శాతం మేర మిగలు రెవెన్యూను సాధించే అవకాశం ఉందని అంచనా. దీని వల్ల మొత్తంపైన స్థూల ద్రవ్యలోటు 3.1 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గుతుందని ఆర్‌బీఐ పేర్కొంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రప్రభుత్వాలు పోటీలు పడి రైతుల రుణాలను మాఫీ చేస్తున్నాయి. దీని వల్ల రెవెన్యూ వ్యయం 0.13 శాతం పెరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, బడ్జెట్‌ల ఆధారంగా ఆర్‌బీఐ నివేదికలు తయారు చేసింది. 2014 నుంచి మొదలుపెడితే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్, తాజాగగా కర్నాటక ప్రభుత్వాలు రైతుల రుణాలను మాఫీచేశాయి. మొత్తంల జీడీపీలో వీటి వాటా 0.32 శాతం. వచ్చే ఏడాది మరిన్ని రాష్ట్రాలు రైతుల రుణాలను మాఫీ చేసే అవకాశం ఉంది. రుణాలను మాఫీ చేయడం వల్ల వౌలిక సదుపాయాల కల్పనపై పెట్టుబడి వ్యయం తగ్గింది. రుణ మాఫీ వల్ల అభివృద్ధి పతనమైందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. రుణమాఫీ వల్ల పరపతి క్రమశిక్షణ గాడితప్పింది. పరపతి విధానం దెబ్బతింది. ఉద్యోగులకు భారీగా వేతనాలు పెంచడం వల్ల రెవెన్యూ వ్యయం పెరుగుతోంది. స్ధూల ద్రవ్యలోటుపై దీని ప్రభావం 0.27 శాతం మేర ఉంది. జీఎస్‌టీ అమలు వల్ల కూడా రెవెన్యూ వసూళ్లు తగ్గాయి. రాష్ట్రాల్లో పన్నుల రాబడి తగ్గింది. కాగా జీఎస్‌టీ నిలకడ సాధిస్తే, రాష్ట్రాల రెవెన్యూ పుంజుకుంటుందని ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ పాత్ర చెప్పారు.