బిజినెస్

బాలికల అవిద్యతో ఆర్థికంగా నష్టమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 12: బాలికలకు మనం సరైన విద్యాసౌకర్యం కల్పించకపోవడం వల్ల అంతర్జాతీయ సమాజానికి ఆర్థికంగా 15 నుంచి 30 ట్రిలియన్ డాలర్ల వరకు నష్టం జరుగుతోందని ప్రపంచబ్యాంకు పేర్కొంది. జూలై 12న మలాల డేను పురస్కరించుకుని ప్రపంచబ్యాంకు ప్రతినిధి మాట్లాడుతూ తక్కువ ఆదాయం గల దేశాల్లో మూడింట్లో రెండోవంతు బాలికలు ప్రాథమిక విద్యను పూర్తి చేస్తుండగా, ముగ్గురిలో ఒకరు మాత్రమే లోయర్ సెకండరీ స్కూల్ విద్యను పూర్తి చేస్తున్నారని వరల్డ్ బ్యాంక్ మిస్స్‌డ్ ఆపర్చునిటీస్ (కోల్పోయిన అవకాశాలు) అనే అంశంపై ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. దీనివల్ల మనం మానవ సంపదను కోల్పోతున్నామని పేర్కొంది. చాలామంది మహిళలు విద్యను నేర్వకపోవడమే దీనికి కారణమని తెలిపింది. వీరు విద్యనభ్యసించకపోవడం వల్ల 15 నుంచి 30 ట్రిలియన్ డాలర్లను అంతర్జాతీయ సమాజం కోల్పోతుందన్నారు. చదువుకున్న మహిళ ఒకవేళ ఏదైనా ఉద్యోగం, ఉపాధి కల్పించుకుంటే చదువులేని వారి కంటే ఇంచుమించు రెట్టింపు సంపాదిస్తుందని పేర్కొంది. స్ర్తి విద్య గురించి 2012లోనే ప్రచారం చేసి తాలిబన్ల ఆగ్రహానికి గురైనా తన లక్ష్యాన్ని వీడక వారినే ఎదురించిన నోబెల్ బహుమతి గ్రహీత మలాల 16వ పుట్టిన రోజు సందర్భంగా జూలై 12, 2013లో మలాల డేగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిందని ప్రపంచ బ్యాంకు ఈ సందర్భంగా గుర్తు చేసింది. గురువారం మలాల 21వ పుట్టిన రోజును జరుపుకుంటున్న సందర్భంగా మనం స్ర్తి విద్య గురించి చర్చించుకోవాల్సిన అవసరాన్ని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 130 మిలియన్ల బాలికలు ఇంజనీర్లు, డాక్టర్లు, సీఈవోలు, జర్నలిస్టులు కాలేకపోతున్నారంటే దానికి కారణం అవిద్యేనని పేర్కొంది. వీరందరికీ మనం విద్యను సమకూరుస్తే ఆర్థికంగా వారు సాధికారిత సాధించడమే కాకుండా అంతర్జాతీయంగా ఆర్థిక రంగం పటిష్టమవుతుందని వరల్డ్‌బ్యాంకు సిఇఓ క్రిష్టలినీ జార్జివా తెలిపారు. అంతేకాకుండా ఆర్థిక రంగానికి, ప్రజారోగ్యానికి ఒక స్థిరత్వం ఏర్పడుతుందని చెప్పింది. ఒక మంచి సమాజాన్ని నిర్మించాలని నేటి నాయకులు అనుకుంటే దానికి వారు బాలికల మాధ్యమిక స్థాయి విద్యపై దృష్టి పెట్టాలి. దానికి నిధులు ఎక్కువగా కేటాయించాలి. ఇకనైనా బాలికల విద్యకు పెట్టుబడి పెట్టడంలో ఆలస్యం చేయరాదని మలాల ఫండ్ సహ వ్యవస్థాపకుడు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆరు నుంచి 17 సంవత్సరాల వయసున్న బాలికల్లో 75 శాతం విద్యలేని వారేనని ఆయన చెప్పారు. ఇకనైనా మనం లింగవివక్షను విడనాడి బాలికా విద్యపై దృష్టి సారించాలని ప్రపంచ బ్యాంకు సిఇఓ అన్నారు. విద్యలో వివక్ష చూపితే అది ప్రంచవ్యాప్తంగా మన వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. బాలురతో సమానంగా బాలికలకు కూడా విద్యను నేర్పించాలని సూచించారు. ఇది సమాజానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. అలాగే సమాజంలో దురాచారంగా ఉన్న బాల్యవివాహాలు అధికంగా ఉన్న 18 దేశాలలో వీటిని అరికడితే జనాభాపరంగా ఆయా దేశాలకు ఎంతో ప్రయోజనమన్నారు. ఇక భారతదేశంలో ప్రస్తుతం జనాభా పెరుగుదల శాతం సంవత్సరానికి 1.2 శాతం ఉందని, బాల్యవివాహాలను అరికడితే దీనిని -0.18 శాతానికి తగ్గించవచ్చునని చెప్పారు.