బిజినెస్

ప్రపంచ ఆర్థిక రంగంలో ఐదో స్థానానికి చేరుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 12: దేశంలో సగటు తలసరి ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని, తలసరి ఆదాయం ఆశించిన స్థాయి కంటే తక్కువగా ఉందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చెప్పారు. ప్రపంచంలో ఆరవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా భారత్ ఎదుగుతుందని ముందే ఊహించామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థికంగా బలమైన దేశంగా త్వరలోనే భారత్ అవతరిస్తుందన్నారు. ఆర్థిక రంగంలో ఐదో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్‌ను వెనక్కు నెట్టి భారత్ ఆ స్థానాన్ని ఆక్రమిస్తుందన్నారు. ప్రస్తుతం అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, ఇంగ్లాండ్ దేశాలు ఆర్థిక రంగంలో వరుస క్రమంలో ముందంజలో ఉన్నాయన్నారు. ఫ్రాన్స్ కంటే మన దేశ సగటు తలసరి ఆదాయం 20 రెట్లు తక్కువగా ఉందన్నారు. దేశీయ టెక్నాలజీలో స్వావలంభన సాధించే దిశగా అడుగులువేయాలన్నారు. ప్రపంచ బ్యాంకు ఇటీవల ప్రపంచ ఆర్థిక రంగంపై గణాంక వివరాలను విడుదల చేసింది. భారత్ జీడీపీ 2.59 ట్రిలియన్ డాలర్లకు చేరుకుని ఫ్రాన్స్‌ను అధిగమించింది. ఫ్రాన్స్ జీడీపీ 2.58 ట్రిలియన్ డాలర్లు, యుకె జీడీపీ రూ.2.62 ట్రిలియన్ డాలర్లు నమోదైంది.