బిజినెస్

నేడు ఎఫ్‌ట్యాప్సీ వంద సంవత్సరాల వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 3: ఎఫ్‌టాయఫ్సీ శత వసం తాల వేడుకలు సోమవారం ఇక్క డ జరగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఈ వేడుకలను ప్రారంభిస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వాణిజ్య, వ్యాపార, పారి శ్రామిక వేదికగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్య మండళ్ల సమాఖ్య (్ఫ్యప్సీ).. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్య మండళ్ల సమాఖ్య (ఫ్ టాయఫ్సీ)గా మారినది తెలిసిందే. పారిశ్రామిక రంగానికి ధీటైన నాయకత్వం అందించిన ఎఫ్‌టాయఫ్సీ 1917లో ఆవిర్భవించింది. వాణిజ్య, వ్యాపార, పరిశ్రమల రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో వర్తకుల హక్కుల పరిరక్షణకు అండగా నిలిచింది. 1917లో హైదరాబాద్ రాష్ట్ర వాణిజ్య మండలిగా అప్పటి పారిశ్రామికవేత్తలు దీన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో కర్నాటక, మహారాష్టక్రు చెందిన కొన్ని జిల్లాలు కూడా హైదరాబాద్ ఫ్యాప్సీలో ఉండేవి. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫ్యాప్సీగా ఏర్పడింది. వర్తకులు, పరిశ్రమల కోసం కేంద్రం, రాష్ట్రం తెచ్చే చట్టాలు, వివిధ సవరణలపైన ఎఫ్‌టాయఫ్సీ ఎప్పటికప్పుడు పునశ్చరణ తరగతులను నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఎఫ్‌టాయఫ్సీ అధ్యక్షుడిగా రవీంద్ర మోదీ, సీనియర్ ఉపాధ్యక్షుడిగా గౌర శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా అరుణ్ లుహరుకా ఉన్నారు. అయతే సెంటినరీ వేడుకల కమిటీ చైర్మన్‌గా అనిల్ రెడ్డి వెన్నం వ్యవహరిస్తున్నారు. కాగా, శత వసంతాలను పురస్కరించుకుని గవర్నర్ శుభాకాంక్షలు అందజేయగా, ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో ప్రతి నెలా ప్రత్యేకంగా ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎఫ్‌టాయఫ్సీ నిర్ణయంచుకున్నది తెలిసిందే.