బిజినెస్

5 శాతానికి పెరిగిన చిల్లర ద్రవ్యోల్బణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 12: దేశంలో వినియోగ వస్తువుల ధరల ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం జూన్ నెలలో అయిదు నెలల గరిష్ఠ స్థాయి అయిన అయిదు శాతానికి పెరిగింది. గురువారం సాయంత్రం విడుదల చేసిన అధికారిక గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. అంతకు ముందు నెలలో ఈ చిల్లర ద్రవ్యోల్బణం 4.87 శాతం ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం వంటి కారణాల వల్ల దేశంలో జూన్ నెలలో రిటెయిల్ ద్రవ్యోల్బణం పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మధ్యకాలికంగా చిల్లర ద్రవ్యోల్బణం నాలుగు శాతానికి మించకుండా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ దేశంలో అంతకన్నా పైన ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇది వరుసగా ఎనిమిదో నెల. ఆర్‌బీఐ ఆగస్టులో కీలక వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలను గురువారం వెలువడిన చిల్లర ద్రవ్యోల్బణం గణాంకాలు బలపరిచాయి. ఆర్‌బీఐ జూన్ నెలలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. నాలుగేళ్లకు పైగా కాలంలో మొదటిసారి ఆర్‌బీఐ గత నెలలో రెపో రేటును పెంచింది. అయితే మే నెలలో 3.37 శాతం ఉన్న ఆహార ద్రవ్యోల్బణం జూన్ నెలలో 3.18 శాతానికి తగ్గింది. ‘్ఫ్యయెల్ అండ్ లైట్’ సెగ్మెంట్‌లో మే నెలలో 6.84 శాతం ఉన్న కన్స్యూమర్ ద్రవ్యోల్బణం జూన్ నెలలో 7.14 శాతానికి పెరిగింది.