బిజినెస్

యశోదలో బ్రాంఖైల్ థర్మోప్లాస్టీపై శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 12: దేశంలోనే మొట్టమొదటి సారిగా యశోద ఆసుపత్రిలో బ్రాంఖైల్ ధర్మోప్లాస్టీపై ఉన్నత స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ శిక్షణ తరగతులను యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి ప్రారంభించారు. శ్వాసకోశ సంబంధ సమస్యలతో బాధపడే వారికి ఇటీవలే అందుబాటులోకి వచ్చిన బ్రాంఖైల్ ధర్మోప్లాస్టీపై పల్మనాలజిస్టులకు అవగాహన కల్పించేందుకు నిర్వహించిన శిక్షణ తరగతులకు దేశ, విదేశాలకు చెందిన సుమారు 200 మంది వైద్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వస్తున్న నూతన పద్దతులపై వైద్యులు అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఇతర రంగాల్లో మాదిరిగానే వైద్య రంగంలో సైతం విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, వ్యాధిగ్రస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాధిని పూర్తిగా నయం చేసే విధానాలు అందుబాటులోకి వస్తున్నాయని అన్నారు. వైద్యులు నిత్య నేర్పరులుగా ఉన్నప్పుడే రోగులకు మెరుగైన చికిత్సలు అందించగలుగుతారని అన్నారు. సింగపూర్ రెంది, డాక్టర్ అడ్రియన్ చాన్, మలేషియా నుంచి వచ్చిన డాక్టర్ జమాలుల్ అజిజి అబ్దుల్ రెహమాన్, రుమేనియాకు చెందిన డాక్టర్ ఎలేనా, దేశ రాజధాని ఢిల్లీకి చెందిన డాక్టర్లు దీపక్, కరన్ మదన్‌లు బీటీ చికిత్స ప్రక్రియను వివరించారు. యశోద ఆసుపత్రికి చెందిన హరికిషన్, నాగార్జున మాటూరి, గంగాధర్ రెడ్డి, గోపీ కృష్ణలు లైవ్ డెమాన్‌స్ట్రేషన్ ద్వారా నూతన పద్దతులపై శిక్షణ ఇచ్చారు.

చిత్రం..శిక్షణ శిబిరంలో మాట్లాడుతున్న పవన్ గోరుకంటి