బిజినెస్

సెనె్సక్స్ సరికొత్త రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 12: ఇంధన, చమురు- సహజ వాయువు, బ్యాంకింగ్ రంగాల షేర్లకు లభించిన గట్టి కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం బాగా బలపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 282 పాయింట్లకు పైగా పుంజుకొని సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి 36,548.41 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ అయిదు నెలల తరువాత తిరిగి 11,000 పాయింట్ల కీలక స్థాయిని అధిగమించి 11,023 పాయింట్ల వద్ద స్థిరపడింది. చమురు నుంచి టెలికం వరకు వివిధ రంగాలకు విస్తరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ విలువ గురువారం 4.42 శాతం పెరిగి సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి వద్ద ముగిసింది. దీంతో ఈ కంపెనీ తిరిగి 100 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన కంపెనీల జాబితాలో చేరింది.
రూపాయి విలువ పెరగడం, దేశీయ సంస్థాగత మదుపరుల (డీఐఐల) నుంచి తగిన స్థాయిలో కొనుగోళ్ల మద్దతు లభించడం, విదేశీ ఫండ్‌ల నుంచి తాజాగా పెట్టుబడులు తరలిరావడం, కార్పొరేట్ కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటం వంటి అంశాలు దేశీయ మార్కెట్లు బలోపేతం కావడానికి దోహదపడింది. గురువారం ఉదయం పటిష్టమయిన స్థాయి వద్ద ప్రారంభమయిన సెనె్సక్స్ తరువాత మరింత ముందుకు సాగుతూ ఆల్-టైమ్ ఇంట్రా-డే హై 36,699.53 పాయింట్లను తాకింది. అయితే, ఈ దశలో మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడం వల్ల ఈ సూచీ కొంత దిగజారింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 282.48 పాయింట్ల (0.78 శాతం) ఎగువన 36,548.41 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సంవత్సరం జనవరి 29న నెలకొల్పిన గరిష్ఠ స్థాయి ముగింపు రికార్డును అధిగమించింది. జనవరి 29న సెనె్సక్స్ 36,283.25 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ ఇప్పుడు అయిదు సెషన్లలో కలిసి 973.86 పాయింట్లు పుంజుకుంది.
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా అయిదు నెలల తరువాత గురువారం తిరిగి కీలకమయిన 11,000 పాయింట్ల స్థాయికి పైన ముగిసింది. ఇంట్రా-డేలో ఈ సూచీ 11,078.30 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 74.90 పాయింట్ల (0.68 శాతం) పైన 11,023.20 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సంవత్సరం జనవరి 31 తరువాత ఈ సూచీ ఇంత ఎగువ స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. జనవరి 31న నిఫ్టీ 11,027.70 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదిలా ఉండగా, ఫారిన్ ఫండ్స్ బుధవారం నికరంగా రూ. 636.27 కోట్ల విలువయిన షేర్లను, డీఐఐలు రూ. 15.33 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశాయి.
సెనె్సక్స్ ప్యాక్‌లోని గురువారం లాభపడిన సంస్థలలో విప్రో, లార్సన్ అండ్ టర్బో, హిందుస్తాన్ యూనిలీవర్, ఎస్‌బీఐఎన్, హెచ్‌డీఎఫ్‌సీ ఉన్నాయి. వీటి షేర్ల విలువ 1.46 శాతం నుంచి 4.42 శాతం వరకు పెరిగింది. ముడి చమురు ధరలు బాగా తగ్గిన తరువాత చమురు కంపెనీలు, విమానయాన సంస్థల షేర్ల విలువ బాగా పెరిగింది.