బిజినెస్

మొబైల్ యాప్‌తో సాధారణ రైలు టిక్కెట్ల బుకింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇప్పటి వరకు మొబైల్ యాప్‌తో రైలు రిజర్వేషన్ టిక్కెట్లు పొందేందుకు ఉన్న సౌకర్యం ఇక మీదట సాధారణ టిక్కెట్లను పొందేందుకు వీలుగా అన్‌రిజర్వుడు టికెటింగ్ సిస్టమ్ (యూటిఎస్) మొబైల్ యాప్‌ను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. గురువారం నాడిక్కడ రైల్ నిలయంలో ద.మ.రై జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ ఈ యాప్‌ను లాంఛనంగా ఆవిష్కరించారు. తద్వారా ఇక మీదట రైలు ప్రయాణికులు తమ సాధారణ టిక్కెట్లను మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకునే సౌకర్యం ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది. యూటీఎస్ యాప్‌ను ఆవిష్కరించిన అనంతరం యాప్ పని చేసే విధానం, ప్రయోజనాలను జిఎం విలేఖరులకు వివరించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధి మొత్తంలో ఉన్న రైల్వే స్టేషన్లకు సంబంధించి తమ గమ్య స్ధానాలకు వెళ్లే సాధారణ ప్రయాణికులు యాప్ ద్వారా టిక్కెట్లు పొందవచ్చు. ఫ్లాట్‌ఫాం, సీజనల్ టిక్కెట్లను సైతం ఈ యాప్ ద్వారా పొందే సౌకర్యం కూడా ఉంది. ప్రస్తుతం జనరల్ టిక్కెట్ల కోసం భారీ క్యూ లైన్లలో ప్రయాణికులు నిలిచి ఉండే ఇబ్బంది ఈ యాప్ ద్వారా తొలగిపోతుంది. నగదు రహిత విధానంలో టిక్కెట్లు కొనుగోలు, సీజనల్ టిక్కెట్ల రెన్యువల్ పది రోజుల ముందే చేసుకునే అవకాశం ఉంటుంది. యాప్ ద్వారా తీసుకున్న టిక్కెట్ మెసేజ్‌ను తనిఖీ సమయంలో టీటీఈ, లేదా టీటీఐలకు చూపించాల్సి ఉంటుంది. యాండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరూ గూగుల్ ప్లే స్టోర్ నుంచి యూటిఎస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చును. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 554 రైల్వే స్టేషన్ల నుంచి సాధారణ టిక్కెట్లు పొందేందుకు వీలుగా యాప్‌ను తయారు చేశారు. త్వరలోనే రైల్వే మొత్తం ఈ యాప్ ఆధారిత సాధారణ రైలు టిక్కెట్ల జారీ ప్రక్రియ అమల్లోకి వస్తుంది. రైల్వే యూజర్లు రైల్వే వ్యాలెట్ (ఆర్-వ్యాలెట్)ను ఏర్పాటు చేసుకుని తద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటే చార్జీలో 5 శాతం రాయితీ కూడా వర్తిస్తుంది. ఒక వేళ యాప్ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకుని ఆ టిక్కెట్ ప్రింట్ కావాలనుకునే వారు స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎటివిఎంలు, కో-టీవీఎంల ద్వారా బుకింగ్ కోడ్, మొబైల్ నెంబర్ సమర్పించి ప్రింట్ పొందే వీలు కూడా కల్పించబడింది. టిక్కెట్లను బుక్ చేసుకున్న వారు ఇతర మొబైల్ యూజర్లకు ఆ టిక్కెట్ బదిలీ చేసుకునే అవకాశం ఉండదు. విలేకరుల సమావేశంలో ద.మ. రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమ్మర్షియల్ మేనేజర్ ఎం.జి.శేఖరం ఈ మొబైల్ యాప్ గురించి సమగ్ర పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు.
చిత్రం..యూటీఎస్ మొబైల్ యాప్‌ను ఆవిష్కరిస్తున్న ద.మ.రై జీఎం వినోద్‌కుమార్ యాదవ్