బిజినెస్

ఆసియాలో అతి పెద్ద సంపన్నుడు ముకేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 13: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) చైర్మన్ ముకేశ్ అంబానీ శుక్రవారం ఈ-కామర్స్ సంస్థ అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మాను వెనక్కి నెట్టి ఆసియా ఖండంలోనే అతి పెద్ద సంపన్నుడి స్థానాన్ని ఆక్రమించారు. చమురు శుద్ధి నుంచి టెలికం వరకు బహుళ రంగాలకు విస్తరించి ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ విలువ శుక్రవారం స్టాక్ మార్కెట్‌లో 1.6 శాతం పెరిగి, రూ. 1,099.8కు చేరింది. దీంతో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ సంపద విలువ 44.3 బిలియన్ డాలర్లకు పెరిగింది. అలీబాబా గ్రూప్ లిస్టయిన అమెరికా స్టాక్ మార్కెట్‌లో గురువారం మార్కెట్ ముగిసే సమయానికి ఆ కంపెనీ షేర్ విలువను బట్టి జాక్ మా సంపద 44 బిలియన్ డాలర్లు. దీంతో ముకేశ్ శుక్రవారం జాక్ మాను వెనక్కి నెట్టి ఆసియాలోనే అతి పెద్ద సంపన్నుడి స్థాయికి ఎదిగారు. రిలయన్స్ తన పెట్రోకెమికల్స్ సామర్థ్యాన్ని ఈ సంవత్సరం రెండింతలకు పెంచింది. దీంతో పాటు కొత్తగా స్థాపించిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్‌కు ఇనె్వస్టర్ల నుంచి మంచి ఆదరణ లభించింది. ఫలితంగా ఈ సంవత్సరం ముకేశ్ అంబానీ సంపద 4 బిలియన్ డాలర్లు పెరిగింది. మరోవైపు, అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు జాక్ మా సంపద 2018లో 1.4 బిలియన్ డాలర్లు తగ్గింది.