బిజినెస్

రికార్డు స్థాయినుంచి కిందికి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 13: బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ గురువారం సాధించిన సరికొత్త ముగింపు రికార్డు స్థాయి నుంచి శుక్రవారం స్వల్పంగా దిగజారి 36,541.63 పాయింట్ల వద్ద ముగిసింది. దేశీయ స్టాక్ మార్కెట్లను ఉత్తేజపరిచే ప్రపంచ పరిణామాలు బలంగా ఉన్నప్పటికీ, ఇటీవల ధరలు పెరిగిన షేర్లలో మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడం వల్ల ఊగిసలాటలో సాగిన లావాదేవీల మధ్య కీలక సూచీలు పుంజుకోలేకపోయాయి. సెనె్సక్స్ బాటలోనే నిఫ్టీ కూడా శుక్రవారం దాదాపు ఫ్లాట్‌గా ముగిసింది. దేశ స్థూలార్థిక గణాంకాలు నిరుత్సాహకరంగా ఉండటం, విదేశీ ఫండ్‌లు భారత స్టాక్ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడుల ఉపసంహరణను నిరాటంకంగా కొనసాగించడం కూడా మార్కెట్లు బలహీనపడటానికి దారితీసిందని బ్రోకర్లు చెప్పారు. శుక్రవారం ఉదయం 36,635.14 పాయింట్ల మెరుగయిన స్థాయి వద్ద ప్రారంభమయిన సెనె్సక్స్ ఇతర ఆసియా మార్కెట్లలో నెలకొన్న సానుకూల ధోరణుల దన్నుగా మరింత ముందుకు సాగుతూ ఒక దశలో ఆల్ టైమ్ హై 36,740.07 పాయింట్లను తాకింది. అయితే తరువాత మదుపరులు ఇటీవల ధరలు పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణకు పూనుకోవడం వల్ల ఆరంభంలో ఆర్జించిన లాభాలను కోల్పోయింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 6.78 పాయింట్ల (0.02 శాతం) దిగువన 36,541.63 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ క్రితం సెషన్‌లో 282.48 పాయింట్లు పుంజుకొని, సరికొత్త గరిష్ఠ స్థాయి ముగింపు రికార్డును నెలకొల్పింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా శుక్రవారం 11,071.35- 10,999.75 పాయింట్ల మధ్య కదలాడి, చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 4.30 పాయింట్ల (0.04 శాతం) దిగువన 11,018.90 పాయింట్ల వద్ద ముగిసింది. గురువారం స్టాక్ మార్కెట్ పనివేళలు ముగిసిన తరువాత వెలువడిన స్థూలార్థిక గణాంకాలు నిరుత్సాహకరంగా ఉండటంతో మదుపరులు శుక్రవారం అప్రమత్తంగా వ్యవహరించి అధిక ధరల వద్ద ఉన్న అనేక రంగాల షేర్లలో లాభాల స్వీకరణకు పూనుకున్నారు. వినియోగ వస్తువుల ధరల ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం జూన్ నెలలో అయిదు నెలల గరిష్ఠ స్థాయి అయిన అయిదు శాతానికి పెరగగా, పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) మే నెలలో ఏడు నెలల కనిష్ట స్థాయి అయిన 3.2 శాతానికి మందగించిన విషయం తెలిసిందే. మదుపరులు శుక్రవారం వౌలిక సదుపాయాలు, స్థిరాస్తి, పీఎస్‌యూలు, ఎఫ్‌ఎంసీజీ, పవర్, క్యాపిటల్ గూడ్స్, ఆరోగ్య సంరక్షణ, బ్యాంకులు, లోహ, వాహన, చమురు- సహజ వాయువు రంగాల షేర్లలో లాభాల స్వీకరణకు పూనుకున్నారు. నష్టపోయిన సంస్థలలో ఓఎన్‌జీసీ, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్‌టీపీసీ, హీరో మోటోకార్ప్, సన్ ఫార్మా, భారతి ఎయిర్‌టెల్ ఉన్నాయి. వీటి షేర్ల విలువ 2.80 శాతం వరకు పడిపోయింది. మరోవైపు, రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ (ఎంక్యాప్) రూ. ఏడు లక్షల కోట్ల మైలురాయిని అధిగమించడంతో ఆ కంపెనీ షేర్లకు మదుపరుల నుంచి మంచి ఆదరణ లభించింది. దీంతో ఆ కంపెనీ షేర్ విలువ 1.34 శాతం పెరిగింది. మార్కెట్ విలువ ఏడు లక్షల కోట్ల మార్కును దాటిన కంపెనీలలో టీసీఎస్ తరువాత రెండో కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. శుక్రవారం లాభపడిన ఇతర సంస్థలలో కోల్ ఇండియా, మారుతి సుజుకి, బజాజ్ ఆటో, కోటక్ బ్యాంక్, ఆసియన్ పెయింట్స్, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, యెస్ బ్యాంక్, టాటా స్టీల్, అదాని పోర్ట్స్ ఉన్నాయి.
దేశీయ మార్కెట్లు లాభపడటం ఇది వరుసగా రెండో వారం. ఈ వారంలో సెనె్సక్స్ గణనీయంగా 883.77 పాయింట్లు (2.48 శాతం) పుంజుకోగా, నిఫ్టీ 246.25 పాయింట్లు (2.29 శాతం) పెరిగింది. ఇదిలా ఉండగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) గురువారం నికరంగా రూ. 742.63 కోట్ల విలువయిన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 366.40 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు.