బిజినెస్

జీఎస్‌టీని సులభతరం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఒకే దేశం ఒకే పన్ను అనే నినాదంతో తీసుకువచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) విధానాన్ని మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉందని సెమినార్‌లో పలురువు ఛార్టర్ అకౌంటెట్స్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం నగరంలో ఇక్కడ ది ఇన్సిటిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెట్స్ అండ్ ఇండియా (ఎస్‌ఐఆర్‌సీఐ) ఆధ్వర్యలో ‘వన్ ఇయర్ ఆఫ్ జీఎస్‌టీ- లెర్నింగ్, ఆన్‌లెర్నింగ్ అండ్ ఎక్స్‌పెక్టేషన్స్’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సమావేశానికి చైర్మన్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు, హైదరాబాద్ బ్రాంచ్ చైర్మన్ సునీల్ కుమార్, సెక్రెటరీ వెంకట్రామ్, వరంగల్ బ్రాంచ్ సభ్యుడు చంచల్ అగర్వాల్‌లు హాజరై ప్రసంగించారు. జీ ఎస్‌టీతో పన్నుల విధానంలో అనేక సంస్కరణలకు ఆస్కారం ఏర్పడిందని అన్నారు. అయితే ఇప్పటికీ ఈ విధానంపై అవగాహన లేకపోవడంతో ఇటు వ్యాపారులు, వినియోగదారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వీటిని పూర్తిస్థాయిలో సరిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో జీఎస్‌టీపై సీఏ రంగం, క్లయింట్లు ఎదుర్కొంటున్న సవాళ్లపై మరియు బలమైన పన్నుల వ్యవస్థను రూపొందించే మార్గాలపై సెమినార్‌లో చర్చించారు. కొందరు వ్యాపారులు పన్ను వసూలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి చెల్లించడం లేదని వీటిపై దృష్టి సారించి సరిచేసేలా చూడాలన్నారు. జీఎస్‌టీ వాపస్‌ను సులభతరం చేయాలని కోరారు. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, మహారాష్ట్రాలకు చెందిన ఛార్టర్డ్ అకౌంటెట్లు పాల్గొన్నారు.

చిత్రం..సదస్సును ప్రారంభిస్తున్న సీఏలు మస్తాన్, చంచల్ అగర్వాల్ తదితరులు