బిజినెస్

ఓర్వకల్లుకు చైనా సంస్థలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూలై 3: కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామికవాడలో 3 చైనా కంపెనీలకు భూమిని కేటాయించే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. ఇటీవల చైనాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కంపెనీలతో చర్చించి అందులో 11 కంపెనీల ప్రతినిధులతో ఒప్పందాలు కుదుర్చుకోగా, మరికొన్ని కంపెనీలు క్షేత్రస్థాయిలో పర్యటించి వసతులు, వనరులను పరిశీలించి తమ నిర్ణయం తెలియజేస్తామని వెల్లడించినట్లు సమాచారం. అందులో మూడు కంపెనీలకు ప్రకాశం జిల్లా దొనకొండతో పాటు కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామికవాడలో వారు కోరిన చోట భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించనుందని తెలు స్తోంది. ఇక అవగాహన ఒప్పందానికి వచ్చే ముందు క్షేత్రస్థాయి పర్యటనకు రావాలనుకుంటున్న చైనా పరిశ్రమల ప్రతినిధులు 45 రోజుల్లో రాష్ట్రానికి వస్తామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. చైనా పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన ముఖ్యమంత్రి దొనకొండ, ఓర్వకల్లు పారిశ్రామికవాడల్లో భూముల వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులను కూడా ఆదేశించారు. ఫీల్డ్ మ్యాప్, ప్రభుత్వ, ప్రైవేట్ భూముల వివరాలు, నీటి వనరులతోపాటు చైనా కంపెనీలు కోరిన వివరాలు అందించాలని సూచించినట్లు సమాచారం. కాగా, ఓర్వకల్లు పారిశ్రామికవాడలో 30 వేల ఎకరాలకుపైగా భూములను పరిశ్రమలకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో ఇప్పటికే సుమారు 10 వేల ఎకరాలు పలు ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలకు కేటాయంచారు. ఆ భూములకు సమీపంలోనే విద్యా సంస్థల సముదాయానికి మరో 2 వేల ఎకరాలు కేటాయించడానికి నిర్ణయించి తొలి విడతగా ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు 120 ఎకరాలు మంజూరు చేశారు. ఇక కొత్తగా చైనా కంపెనీ ప్రతినిధుల బృందం ఓర్వకల్లు భూములపై ఆసక్తి చూపితే పారిశ్రామికంగా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. ఓర్వకల్లు పారిశ్రామికవాడకు నీటి సరఫరాకు ఉద్దేశించిన ప్రాజెక్టు పూర్తిస్థాయి నివేదికను కూడా త్వరితగతిన సిద్ధం చేసి పంపాలని ఆ శాఖ ఉన్నతాధికారులను సర్కారు ఆదేశించినట్లు వినిపిస్తోంది. మరోవైపు ఓర్వకల్లు విమానాశ్రయం నిర్మాణంపై రష్యాలోని విమానయాన సంస్థలతో ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన తాజా నివేదికను జిల్లా అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపడానికి సిద్ధం చేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో నివేదిక పంపుతామని ఓ అధికారి వెల్లడించారు. ఓర్వకల్లు విమానాశ్రయం నిర్మాణానికి 2 నెలల్లో శంకుస్థాపన కార్యక్రమం పూర్తిచేసి పనులను డిసెంబర్ నాటికి ప్రారంభిం చి రెండేళ్లలో పూర్తి చేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం చిన్న విమానాశ్రయాలు, తక్కువ దూ రం ప్రయాణించే విమానాల చార్జీల విషయంలో తీసుకున్న నిర్ణయంతో ప్రజాదరణ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి తొలి విమానం 2018 మేలో ఎగిరేందుకు అవసరమైన చర్య లు తీసుకోవాలని ప్రభు త్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది.

ఓర్వకల్లు పారిశ్రామికవాడకు శంకుస్థాపన చేస్తున్న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (ఫైల్‌ఫొటో)
చిత్రం... కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని భూములు