బిజినెస్

ఇంటెక్స్ నుంచి ‘ఇన్ఫీ33’ ఫోన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఇంటెక్స్ ఇన్ఫీ 33 స్మార్ట్ఫోన్‌ను మార్కెట్‌లోకి అందుబాటులోకి తెచ్చింది. ఎన్నో ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఈ ఫోన్‌ను రూ.5049లకే వినియోగదారులకు అందిస్తోంది. 5.34 అంగుళాల డిస్‌ప్లే, 1.3 గెగాహెడ్జ్ క్యాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 128జీబి స్టోరేజ్ కలిగి ఉంటుంది. అండ్రాయిడ్ 7.0నాగౌట్‌తో పనిచేసే ఈ ఫోన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 5 మెగా పిక్సెల్ కెమెరా కలిగి ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం 3000, 4జీ టెక్నాలజీ, బ్లూటూత్ సౌకర్యం ఉండటం దీని ప్రత్యేకతలు. ఇప్పటికే ఇన్ఫీ సీరిస్‌లో తీసుకువచ్చిన ఇతర ఫోన్‌లతో పోల్చితే దీనికి భారీ మార్కెట్ ఉంటోందని కంపెనీ భావిస్తోంది.