బిజినెస్

తగ్గిన పసిడి దిగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బంగారం దిగుమతులు 25 శాతం పడిపోయి, 8.43 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అటు ప్రపంచ మార్కెట్‌లో, ఇటు దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గడం వల్లనే దిగుమతులు తగ్గాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికంలో పసిడి దిగుమతుల విలువ 11.26 బిలియన్ డాలర్లు. ఈ సంవత్సరం జనవరి నెల నుంచి బంగారం దిగుమతులు తగ్గుతూ వస్తున్నాయి. అయితే, తగ్గిన బంగారం దిగుమతులు కరెంటు ఖాతా లోటు (సీఏడీ) ఎక్కువగా పెరగకుండా నిరోధించడానికి దోహదపడ్డాయి. విదేశీ మారకద్రవ్యం రాక, పోకల మధ్య వ్యత్యాసం అయిన సీఏడీ 2017-18 ఆర్థిక సంవత్సరంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 1.9 శాతానికి పెరిగి, 48.7 బిలియన్ డాలర్లకు చేరింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఉన్న కరెంటు ఖాతా లోటు జీడీపీలో 0.6 శాతం (14.4 బిలియన్ డాలర్ల)తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ముడి చమురు ధరలు పెరుగుతుండటం, రూపాయి విలువ పడిపోతుండటం, పోర్ట్ఫోలియో ఇనె్వస్ట్‌మెంట్లు తరలిపోతుండటం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం కరెంటు ఖాతా లోటు మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు నెలకొన్నాయి. ముడి చమురు ధరల పెరుగుదల, దిగుమతులు దేశ వాణిజ్య లోటుపైనా ప్రతికూల ప్రభావం చూపాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వీటి కారణంగా వాణిజ్య లోటు 44.94 బిలియన్ డాలర్లకు పెరిగింది. క్రితం ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికంలో వాణిజ్య లోటు 40 బిలియన్ డాలర్లు ఉండింది. ప్రపంచంలో అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకుంటున్న దేశం భారత్. మన దేశంలో బంగారు నగలకు ఉన్న డిమాండ్ కారణంగా అధికంగా పసిడి దిగుమతులు చేసుకుంటున్నాం. ఇదిలా ఉండగా, జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో వెండి దిగుమతులు 104.5 శాతం వృద్ధితో 364.24 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. మన దేశం ఏటా 700-800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది.