బిజినెస్

టెక్నాలజీతో ఉద్యోగాలు ఊడవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజి, జూలై 15: కొత్త టెక్నాలజీ వల్ల ఉన్న ఉద్యోగాలు ఊడవని, కొత్తవి సృష్టించబడతాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ అన్నారు. ఉద్యోగాలు పోతున్నాయన్న అంశంపై తాను ఈ లాజిక్‌ను మాట్లాడటం లేదని, వాస్తవానికి కొత్త టెక్నాలజీ వచ్చి ఒక ఉద్యోగంపోతే అదనంగా 20 జాబ్‌లు వస్తాయని ఆయన చెప్పారు. గోవా ఐటి పాలసీ 2018 విడుదల సందర్భంగా గోవా ముఖ్యమంత్రి పారికర్‌తో పాల్గొన్న కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఐటీ రంగంలో 40 లక్షల మంది పనిచేస్తున్నారని, అయితే ఇదే పరిశ్రమలో 1.25 లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని ఆయన చెప్పారు. నాస్‌కామ్ నివేదిక ప్రకారం ఆరులక్షల ఉద్యోగాలు కేవలం ఐటీ రంగం ద్వారానే వస్తున్నాయన్నారు. కొత్త డిజిటల్ ఎకోసిస్టమ్ ద్వారా ఉద్యోగాల సృష్టి జరుగుతుందని అన్నారు. ఐటి దిగ్గజాలకు కేంద్రంగా మారిన భారత్‌వైపు ప్రపంచమంతా ఎంతో ఆశగా చూస్తోందని ఆయన చెప్పారు. ఐటీ విప్లవం గురించి ఆయన ప్రస్తావిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో సైతం బీపీవోలను ఏర్పాటు చేయాలని 2015లో కేంద్రం తీసుకున్న నిర్ణయం మేరకు ప్రస్తుతం 91 బీపీవో కంపెనీలు ఏర్పాటు అయ్యాయని మంత్రి చెప్పారు. ఇటీవల తాను ఆయా ప్రాంతాల్లోని బీపీవోలను సందర్శించినప్పుడు అక్కడ అనేకమంది గ్రామీణ యువకులు పనిచేస్తున్న విషయాన్ని గుర్తించానన్నారు. ఇది చాలా ఆహ్వానించదగిన పరిణామమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తనకు, ప్రధాని నరేంద్రమోదీతో జరిగిన సంభాషణను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ గుర్తు చేసుకున్నారు. ఒక రోజు ప్రధాని మోదీ నాతో మాట్లాడుతూ ‘దేశంలో ఇంతమంది మొబైల్ ఫోన్లు వాడుతున్నారు కదా? వాటిలో ఎన్ని మనదేశంలో తయారవుతున్నాయి?’ అని తనను ప్రశ్నించారని, దాంతో తాను ఆ విషయాన్ని పరిశీలించగా కేవలం రెండు మొబైల్ కంపెనీలు మాత్రమే మనదేశంలో ఫోన్లను తయారు చేస్తున్నాయని గుర్తించానన్నారు. దాంతో తాము ఆ విషయంపై దృష్టి సారించి చేసిన కృషి మేరకు ప్రస్తుతం దేశంలో 120 ఫ్యాక్టరీల్లో మొబైల్‌ఫోన్లు, వాటి పరికరాలు తయారవుతున్నాయని మంత్రి తెలిపారు. 15రోజుల క్రితం నొయిడాలో శాంసంగ్ కంపెనీ యూనిట్‌ను ఏర్పాటు చేశారని, దీని ద్వారా నెలకు 1.10 కోట్ల మొబైల్ ఫోన్లు తయారవుతాయని, అనేక వేల మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మొబైల్ ఫోన్ల తయారీని 20 కోట్లకు పెంచినట్టు చెప్పారు. వీటి ద్వారా ఆదాయం కూడా 1,32,000 కోట్లకు చేరిందని చెప్పారు. ఇప్పుడు భారత్ దేశం కేవలం మొబైల్ ఎలక్ట్రానిక్స్‌లోనే కాకుండా మెడికల్ ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్‌లో కూడా లీడర్ కానుందన్నారు. గోవా రాష్ట్రం ఎలక్ట్రానిక్ హబ్ కానుందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. తాము 2016లో ప్రవేశపెట్టిన భారత్ ఇంటర్ ఫేస్ ఫర్ మనీ (బిహెచ్‌ఐఎం) మొబైల్ యాప్‌ను ఇప్పుడు రోజుకు మూడు లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకుంటున్నారని ఆయన చెప్పారు. ఈ యాప్‌ద్వారా మార్చిలో 24,117 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని కేంద్రమంత్రి చెప్పారు.