బిజినెస్

కార్పొరేట్ల ఆదాయాలే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: హిందుస్తాన్ యూనిలీవర్, కోటక్ మహీంద్ర బ్యాంక్ వంటి బ్లూచిప్ కంపెనీల తొలి త్రైమాసిక ఆదాయాలు, ద్రవ్యోల్బణం గణాంకాలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల గమనం, సానుకూల ప్రపంచ పరిణామాలు సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల గమనాన్ని నిర్దేశించనున్నాయనేది నిపుణుల అంచనా. ‘కార్పొరేట్ కంపెనీల తొలి త్రైమాసిక ఆదాయాలపై మదుపరుల దృష్టి కేంద్రీకరణ కొనసాగుతుంది. అంతర్జాతీయ విషయాలలోకి వెళ్తే, అమెరికా-చైనా మధ్య వాణిజ్య సంబంధ వివాదాలు తగ్గుతాయనే విశ్వాసం మదుపరులలో ఉంది. ముడి చమురు ధరలు స్వల్పంగా దిద్దుబాటుకు గురయ్యాయి. వీటి ధరలు మరింత తగ్గుతాయి. అది ప్రపంచ మార్కెట్లకు సానుకూలంగా ఉంటుంది’ అని కోటక్ సెక్యూరిటీస్ పరిశోధనా విభాగం వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ జర్బాడె పేర్కొన్నారు. వచ్చే వారం ప్రధానంగా హిందుస్తాన్ యూనిలీవర్, కోటక్ మహీంద్ర బ్యాంక్, బజాజ్ ఆటో, విప్రో కంపెనీల తొలి త్రైమాసిక ఆదాయాలు వెల్లడి కానున్నాయి. ‘కార్పొరేట్ కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు వెలువడే సీజన్ ఇప్పుడే మొదలయింది. ప్రస్తుతం మార్కెట్ ఆచితూచి అడుగులు వేసే స్థితిలో ఉంది’ అని సామ్‌కో సెక్యూరిటీస్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) జిమీత్ మోదీ పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ శుక్రవారం వెలువరించిన ఫలితాలలో జూన్ త్రైమాసికంలో తన నికర ఆదాయాన్ని 3.7 శాతం వృద్ధితో రూ. 3,612 కోట్లకు పెంచుకోవడంతో సోమవారం ఆ కంపెనీ షేర్లపై మార్కెట్ దృష్టి కేంద్రీకృతం అవుతుంది. ఇన్ఫోసిస్ కంపెనీ ఫలితాలు శుక్రవారం మార్కెట్ పనివేళలు ముగిసిన తరువాత వెలువడ్డాయి. ‘ప్రపంచ ఆర్థిక విషయాలను పరిశీలిస్తే, చైనా వచ్చే వారం తన రెండో త్రైమాసిక స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలను ప్రకటిస్తుంది’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ అండ్ క్యాపిటల్ మార్కెట్ స్ట్రాటజి అధిపతి వీకే శర్మ పేర్కొన్నారు. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ గణనీయంగా 883.77 పాయింట్లు (2.48 శాతం) పుంజుకొని 36,541.63 పాయింట్ల వద్ద ముగిసింది. ‘చమురు ధరలు కాస్త తగ్గుతుండటం మార్కెట్ కదలికలో స్థిరత్వం చోటు చేసుకుంటుందనే సంకేతాలను ఇస్తోంది’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం అధిపతి వినోద్ నాయర్ పేర్కొన్నారు.