బిజినెస్

పుంజుకున్న కార్పొరేట్ భారతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వ్యాపార అనుకూల విధానాల ప్రభావం ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి, అలాగే వ్యాపార, వాణిజ్య పరంగా భారీ ఎత్తున లావాదేవీలు జరగడానికి దోహదం చేస్తోందని తాజాగా జరిగిన ఓ సర్వేలో స్పష్టమైంది. విప్లవాత్మక రీతిలో చేపట్టిన వస్తు సేవల పన్ను (జిఎస్‌టి),రియల్ ఎస్టేట్ నియంత్రణ అథారిటీ ఏర్పాటు, అందరికీ ఆవాస కల్పన, దివాల కోడ్ వంటి చర్యలు సానుకూల ఫలితాలను అందిస్తున్నాయని ఈ సర్వేలో తేటతెల్లమైంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల వ్యవధిలో కార్పొరేట్ భారతం భారీ పరిమాణంలో డీల్స్ కుదుర్చుకోవడం ఇందుకు నిదర్శనమని పేర్కొంది. జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో 74.8బిలియన్ డాలర్లకు పైగా వ్యాపార ఒప్పందాలను కార్పొరేట్ భారతం ప్రకటించినట్టు వెల్లడించింది. గత ఏడాది కుదిరిన ఈ రకమైన ఒప్పందాలను బట్టి చూసే ఈ సారివీటి సంఖ్య దాదాపు 90శాతం ఎక్కువని థార్న్‌టన్ డీల్‌ట్రాకర్ నివేదిక తెలిపింది. విలీనాలులు సహా అనేక రకాలుగా ఈ వ్యాపార లావాదేవీలు చోటుచేసుకున్నాయని, వీటన్నింటికీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సంస్కరణల విధానాలు ఎంతగానో దోహదం చేసినట్టు పేర్కొంది. అయితే ఈ సంస్కరణల ద్వారా ఉద్దేశించిన ప్రయోజనాలు పూర్తిస్థాయిలో సాకారం కావాలంటే మరింతగా వీటి అమలుకు సంబంధించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని వివరించింది. ఇ-కామర్స్, టెలికాం, ఎనర్జీ, తయారీ రంగం, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఈ ఏడాది మొదటి ఆర్నెల్ల కాలంలో భారీగా పెట్టుబడులు రావడంతో పాటు లావాదేవీలు జరిగినట్టు వెల్లడించింది.