బిజినెస్

ఎల్‌ఐసికి లైన్ క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: ఐడిబిఐ బ్యాంకు లో మెజార్టీ షేర్లను కొనుగోలు చేసేందుకు బీమా సంస్థ ఎల్‌ఐసికి బోర్డు అమోదం లభించింది. ప్రాధాన్యతా షేర్ల ద్వారా ఐడిబిఐలో 51శాతం వాటాను ఎల్‌ఐసి సంతరించుకుంటుంది. ఈ విషయాన్ని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్‌సి గార్గ్ సోమవారం నాడిక్కడ వెల్లడించారు. తాజా నిర్ణయం నేపథ్యంలో మూలధనాన్ని సమీకరించేందుకు ఎల్‌ఐసికి ఐడిబిఐ ప్రిఫరెన్సియల్ షేర్లను జారీ చేస్తుంది. రుణాల భారంతో ఉన్న ఐడిబిఐకి ప్రస్తుతం మూలధనం అవసరమని,దీన్ని సమీకరించుకోవడంలో భాగంగానే ఎల్‌ఐసికి మెజార్టీ షేర్లను విక్రయించాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగిందని బోర్డులో సభ్యుడిగా కూడా ఉన్న గార్గ్ వివరించారు. ప్రాధాన్యతా షేర్ల జారీతో పాటు ఐడిబిఐకి మరోమార్గం కూడా అందుబాటులో ఉందని వెల్లడించిన ఆయన ‘ప్రభుత్వం నుంచి ఈ షేర్లను కొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పటికీ దీని వల్ల ఐడిబిఐకి అవసరమైన మూలధనం లభించే వీలు ఉండదు’అని తెలిపారు. అందుకే ప్రిఫరెన్సియల్ షేర్ల జారీ మార్గంలో ముందుకు వెళుతున్నామన్నారు. ప్రభుత్వ రంగంలోని ఐడిబిఐ లిస్టెడ్ కంపెనీ కావడం వల్ల షేర్లను కొనుగోలు చేయడంలో తదుపరి చర్యగా సెబీని ఎల్‌ఐసి ఆశ్రయించాల్సి ఉంటుంది. ఐడిబిఐలో మెజార్టీ వాటా కొనుగోలుకు ఇప్పటికే ఎల్‌ఐసికి బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డిఎఐ అనుమతి లభించింది. అలాగే తన వాటా ను ఎల్‌ఐసికి విక్రయించే విషయంలో ఐడిబిఐ కూడా తన బోర్డు ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఐడిబిఐ షేర్ల విక్రయం విషయంలో ఓపెన్ ఆఫర్ ఉండక పోవచ్చునని, ఇందుకు కారణం ఈ బ్యాంకులో ప్రజల వాటా పరిమితం కావడమేనని గార్గ్ తెలిపారు. కాగా ఇప్పటికే ఐడిబిఐలో ఎల్‌ఐసికి 7-7.5శాతం వాటా ఉందని, మెజార్టీ వాటా కోసం మిగతా షేర్లను కొనుగోలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. మెజర్టీ వాటాను విక్రయించడం ద్వారా ఎల్‌ఐసికి ఐడిబిఐ నుంచి ఎంత మేరకు మూలధనం లభించే అవకాశం ఉంటుందన్న దానిపై గార్గ్ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే అభిజ్ఞ వర్గాల కథనం ప్రకారం మెజార్టీ వాటాను విక్రయించడం ద్వారా ఐడిబిఐకి పది వేల నుంచి 13వేల కోట్ల రూపాయల వరకూ మూలధన మద్దతు లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వాటాను కొనుగోలు చేయడం ద్వారా ఐడిబిఐ బ్యాంకు బోర్డులో నలుగురు సభ్యుల్ని నియమించుకునే అవకాశం ఎల్‌ఐసికి ఉంటుందని చెబుతున్నారు.