బిజినెస్

మార్చి నాటికి 4.1 శాతానికి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: జూన్ నెలలో నాలుగేళ్ల గరిష్ఠ స్థాయి అయిన 5.77 శాతానికి పెరిగిన టోకు ధరల ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని, 2019 మార్చి నాటికి ఇది 4.1 శాతానికి తగ్గుతుందని ఒక నివేదిక పేర్కొంది. మే నెలలో 4.43 శాతం ఉన్న డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం జూన్‌లో కొన్ని ప్రతికూల పరిస్థితుల కారణంగా వేగంగా 5.77 శాతానికి పెరిగింది. ‘్ఫ్యయెల్ అండ్ పవర్’ ద్రవ్యోల్బణం పెరగడం వల్లనే జూన్‌లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం పెరిగింది. ‘డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 2019 మార్చి నాటికి 4.1 శాతానికి తగ్గే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో సగటు డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇది 2.9 శాతంగా ఉంది’ అని కోటక్ ఎకనమిక్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. ఇదిలా ఉండగా, రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్య విధానాన్ని నిర్ణయించే సమయంలో పరిగణనలోకి తీసుకునే రిటెయిల్ ద్రవ్యోల్బణం జూన్ నెలలో అయిదు నెలల గరిష్ఠ స్థాయి అయిన అయిదు శాతానికి పెరిగింది. వినియోగ వస్తువుల ధరల సూచీ (సీపీఐ) ఆధారంగా రిటెయిల్ ద్రవ్యోల్బణాన్ని గణిస్తారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్నందున ఆర్‌బీఐ అప్రమత్తంగా వ్యవహరిస్తుందని, మరింత కఠినంగా వ్యవహరిస్తుందని కోటక్ ఎకనమిక్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. ‘పంటల కనీస మద్దతు ధరలు (ఎంఎస్‌పీ) పెరగడం, రుతుపవనాల కదలికలు, విత్తనాలు విత్తడంలో ప్రగతిని బట్టి చూస్తే ఈ సంవత్సరం పంటల దిగుబడులు తగ్గే సూచనలు కనపడుతుండటం వల్ల కీలక ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఆర్‌బీఐ అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ఆగస్టులో జరిగే విధాన సమీక్ష సందర్భంగా కీలక వడ్డీ రేట్లను మరో 25 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉంది’ అని ఆ నివేదిక పేర్కొంది.