బిజినెస్

మళ్లీ బలపడిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: రెండు రోజుల పాటు పడిపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం మళ్లీ బలపడ్డాయి. చమురు, లోహ, పీఎస్‌యూ షేర్లలో వచ్చిన ర్యాలీ ఫలితంగా బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 196 పాయింట్లకు పైగా పుంజుకొని 36,519.96 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కీలకమయిన 11,000 పాయింట్లకు పైన స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బాగా తగ్గడం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లలో పలు షేర్ల ధరలు బాగా పెరిగాయి. ముడి చమురు ధరలు నాలుగు శాతానికి పైగా తగ్గడంతో మార్కెట్ సెంటిమెంట్ బలపడటంతో పాటు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పుంజుకుందని బ్రోకర్లు చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), కార్పొరేషన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు కొద్ది రోజులలో సుమారు రూ. పది వేల కోట్ల నిధులు సమకూర్చనున్నట్టు వచ్చిన వార్తలు కూడా దేశీయ మార్కెట్లలో కొనుగోళ్ల జోరును వేగవంతం చేశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు నియంత్రణ సంస్థ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా తమ మూల ధన అవసరాలను తీర్చుకోవడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నిధులు సమకూర్చనుంది. చమురు-సహజ వాయువు, బ్యాంకింగ్, ఫార్మా రంగాల షేర్లలో వచ్చిన ర్యాలీ వల్ల బీఎస్‌ఈ సెనె్సక్స్ దాదాపు సరికొత్త గరిష్ఠ స్థాయికి చేరింది. బీఎస్‌ఈ సెనె్సక్స్ మంగళవారం ఉదయం సానుకూల స్థాయి వద్ద ప్రారంభమయి, తరువాత మరింత పైకి ఎగబాకుతూ ఇంట్రా-డేలో 36,549.55 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరింది. అయితే తరువాత మదుపరులు హెచ్‌యూఎల్, ఐటీసీ, ఇన్ఫోసిస్ షేర్లలో లాభాల స్వీకరణకు పూనుకోవడం వల్ల ఒక దశలో 36,261.78 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 196.19 పాయింట్ల (0.54 శాతం) పైన 36,519.96 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ క్రితం రెండు సెషన్లలో కలిసి రికార్డు స్థాయి ముగింపు నుంచి 224.64 పాయింట్లు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 71.20 పాయింట్లు (0.65 శాతం) పుంజుకొని 11,008.05 పాయింట్ల వద్ద ముగిసింది. అంతకు ముందు ఈ సూచీ 11,018.50- 10,925.60 పాయింట్ల మధ్య కదలాడింది. సెనె్సక్స్ ప్యాక్‌లోని ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ మంగళవారం అత్యధికంగా 2.98 శాతం లాభపడింది. సన్ ఫార్మా 2.97 శాతం లాభంతో రెండోస్థానంలో నిలిచింది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎంఅండ్‌ఎం, వేదాంత లిమిటెడ్, హీరో మోటోకార్ప్, అదాని పోర్ట్స్, రిల్, ఆసియన్ పెయింట్స్, కోల్ ఇండియా, మారుతి సుజుకి, యెస్ బ్యాంక్, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ కూడా కీలక సూచీలు పుంజుకోవడానికి దోహదపడ్డాయి. వీటి షేర్ల విలువ 2.70 శాతం వరకు పెరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలు- హెచ్‌పీసీఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బీపీసీఎల్, ఓఎన్‌జీసీ షేర్ల విలువ 6.31 శాతం వరకు పెరిగింది. సెనె్సక్స్ ప్యాక్‌లోని హిందుస్తాన్ యూనిలీవర్ అత్యధికంగా నాలుగు శాతం నష్టపోయింది. భారతి ఎయిర్‌టెల్, ఐటీసీ కూడా నష్టపోయాయి.