బిజినెస్

వివాదస్పద ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లుపై కేంద్రం వెనకడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: వివాదస్పద ఫైనాన్షియల్ రెజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ (ఎఫ్‌ఆర్‌డిఐ) బిల్లు 2017ను పార్లమెంటులో ఉపసంహరించుకునే యోచనలో కేంద్రం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. డిపాజిటర్ల ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఈ బిల్లు ఉందనే విమర్శలు రావడంతో ఈ బిల్లుపై కేంద్రం వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. కేంద్రమంత్రి మండలి కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ఆగస్టు 10వ తేదీ వరకు జరుగుతాయి. ఈ సమావేశాల్లోనే బిల్లును ఉపసంహరించుకునే విషయమై కేంద్రం ప్రకటన చేయవచ్చు. కాగా ఈ బిల్లును గత ఏడాది ఆగస్టు 11వ తేదీన లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో పొందుపరిచిన కొన్ని క్లాజులు సేవింగ్ బ్యాంకు అకౌంట్ల డిపాజిట్లపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులంటున్నారు. ఈ బిల్లును గత సమావేశాల్లోని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి కేంద్రం నివేదించింది. ఈ కమిటీ ప్యానెల్ సమావేశాలు ముగిసేలోగా నివేదికను ఇచ్చే అవకాశం ఉంది. గత సమావేశాల్లోనే ఈ బిల్లుపై విమర్శలు రాగా, డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించేవిధంగా కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆర్థిక శాఖమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. బ్యాంకులు, బీమా కంపెనీలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు దివాలా తీసేటట్లుంటే, డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఈ బిల్లును రూపొందించారు. ఈ బిల్లులో నిర్దేశించినట్లుగా రెజల్యూషన్ కార్పోరేషన్‌ను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది.