బిజినెస్

మరిన్ని బ్యాంకులకు మూలధనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: అయిదు ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీల)కు మూలధనం సమకూర్చడానికి ఆమోదం తెలిపిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా మరో రెండు నుంచి మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల అవసరాలను అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం చివరి నాటికి ఈ బ్యాంకులకు కొంత మూలధనాన్ని సమకూర్చనుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే అయిదు ప్రభుత్వ రంగ బ్యాకులకు రూ. 11,336 కోట్ల మూలధనాన్ని సమకూర్చేందుకు తుది కసరత్తు పూర్తి చేసింది. నియంత్రణ సంస్థ నిర్దేశించిన మార్గదర్శకాలను ఉల్లంఘించకుండా తాము చెల్లించాల్సిన వడ్డీలను చెల్లించడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం చేసే ఈ ఆర్థిక సహాయం ఉపయోగపడుతుందని ఒక సీనియర్ అధికారి తెలిపారు. రానున్న వారాలలో మరో రెండు నుంచి మూడు ప్రభుత్వ బ్యాంకుల కు నియంత్రణ సంస్థ మార్గదర్శకాలను ఉల్లంఘించకుండా ఉండాలంటే మరింత మూలధనం అవసరం అవుతుందని ఆ అధికారి వెల్లడించారు. ఈ రెండు నుంచి మూడు బ్యాంకులకు సెప్టెంబర్‌లో గా కేంద్రం నుంచి నిధులు అందుతాయని ఆయన పేర్కొన్నారు. అడిషనల్ టైర్-1 (ఏటీ-1) బాండ్లు జారీ చేసిన ఈ బ్యాంకులు ఆ బాండ్ల హోల్టర్లకు వడ్డీ చెల్లించవలసి ఉంది. అయితే, ఈ వడ్డీ చెల్లింపుల విషయంలో బ్యాంకులు ఒత్తిడికి గురవుతున్నాయి. చెల్లించవలసిన వడ్డీ చెల్లిస్తే ఈ బ్యాంకుల వద్ద నిబంధనల ప్రకారం ఉండవలసినంత మూలధనం ఉండదు. అప్పుడు నియంత్రణ సంస్థ విధించిన మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు అవుతుంది. మొండి బకాయిలు పెద్ద మొత్తంలో పేరుకుపోవడంతో పాటు నష్టాలు పెరగడం వల్ల ఈ బ్యాంకులు ఏటీ-1 బాండ్లపై చెల్లించవలసిన వడ్డీని చెల్లించడంలో ఒత్తిడికి గురవుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. మూలధన సహాయం చేయాలని కేంద్రం ఇప్పటికే ఆమోదం తెలిపిన బ్యాంకులలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ ఉన్నాయి.