బిజినెస్

మార్కెట్లకు మళ్లీ నష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 18: మదుపరుల లాభాల స్వీకరణతో పాటు ప్రతిపక్షాలు బుధవారం లోక్‌సభలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం దేశీయ స్టాక్ మార్కెట్లను దెబ్బతీసింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ)లో ఊగిసలాటలో సాగిన లావాదేవీల మధ్య సెనె్సక్స్ 147 పాయింట్లు పడిపోయి 36,373.44 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా మానసికంగా కీలకమయిన 11,000 పాయింట్ల దిగువన స్థిరపడింది. ఊగిసలాటలో సాగిన లావాదేవీల మధ్య బుధవారం ఇంట్రా-డేలో సెనె్సక్స్ 427 పాయింట్లు పడిపోయింది. బుధవారం ఉదయం సెషన్‌లో 36,747.87 పాయింట్ల ఇంట్రా-డే గరిష్ఠ స్థాయిని తాకిన సెనె్సక్స్ లోక్‌సభలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తరువాత మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా బలహీనపడిపోయింది. లోహ, స్థిరాస్తి, టెలికం, వాహన, ఎఫ్‌ఎంసీజీ, పవర్, బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 146.52 పాయింట్ల (0.40 శాతం) దిగువన 36,373.44 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బాగా తగ్గడంతో మంగళవారం ఈ సూచీ 196.19 పాయింట్లు పుంజుకుంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా బుధవారం 27.60 పాయింట్లు (0.25 శాతం) పడిపోయి 10,980.45 పాయింట్ల వద్ద స్థిరపడింది. అంతకు ముందు ఇంట్రా-డేలో ఈ సూచీ 11,076.20- 10,956.30 పాయింట్ల మధ్య కదలాడింది. రికార్డు స్థాయిల వద్ద మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో పాటు రాజకీయ పరిణామాలు, రూపాయి తాజాగా బలహీనపడటం, విదేశీ ఫండ్‌ల పెట్టుబడుల ఉపసంహరణ నిరాటంకంగా కొనసాగడం వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని బ్రోకర్లు చెప్పారు. ఇదిలా ఉండగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) మంగళవారం నికరంగా రూ. 673.99 కోట్ల విలువయిన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 840.06 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు.