బిజినెస్

దేశీయ విమానాల్లో పెరుగుతున్న ప్రయాణీకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ విమానాల్లో ప్రయాణం చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది జూన్ నెలలో వృద్ధిరేటు 18.36 శాతం నమోదైంది. విమానాల్లో 2017 జూన్ నెలలో 95.68 లక్షల మంది ప్రయాణించగా, ఈ ఏడాది జూన్ నెలలో 17.57 లక్షల మంది అదనంగా అంటే 113.25 లక్షల మంది ప్రయాణించారు. ఈ వివరాలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. విమాన సంస్థలో ఇండిగో మొదటి స్థానంలో నిలిచింది. మార్కెట్ లీడర్‌గా తన స్ధానాన్ని పదిలపరుచుకుంది. ఈ విమాన సంస్థ గరిష్టంగా 46.3 లక్షల మందిని విమానాల్లో గమ్యస్థానాలకు చేర్చింది. రెండవ స్థానంలో 15.12 లక్షల ప్రయాణీకులతో జెట్ ఎయిర్‌వేస్ నిలిచింది. అలాగే ఇండిగో సంస్థ సమయపాలనలో కూడా ఆదర్శంగా నిలిచింది. 84.1 శాతం విమానాల్లో నిర్దేశించిన సమయానికి ప్రయాణీకులను గమ్యస్థానానికి చేర్చింది. కాగా నేషనల్ క్యారియర్ ఎయిర్ ఇండియామార్కెట్ వాటా తగ్గిపోయింది. పైగా ప్రయాణీకుల సంఖ్య కూడా తగ్గింది. జూన్ నెలలో 14.11 లక్షల మంది ఈ సంస్థ విమానాల్లో ప్రయాణం చేశారు. ఈ సంస్థ మార్కెట్ వాటా 12.5 శాతం తగ్గింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ నెల వరకు ఆరు నెలల్లో విమానాల ద్వారా 686.83 లక్షల మంది ప్రయాణించారు. గత ఏడాది ఇదే కాలంలో 561.55 లక్షల మంది ప్రయాణించారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో వృద్ధిరేటు 21.95 శాతం నమోదైంది.