బిజినెస్

నగదు నిల్వ నిబంధనను సవరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, జూలై 19: ప్రస్తుతం వ్యక్తులు, సంస్థల వద్ద ఉండే నగదు నిల్వలపై ఉన్న నిబంధనను సవరించాలని, 20లక్షలు ఉన్న దీనిని కోటి రూపాయలకు పెంచాలని స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ (సిట్) కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సుప్రీం కోర్టు సూచనల మేరకు 2014లో ఆదాయపు పన్ను, నల్లధనం అరికట్టడం తదితర విషయాలపై కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి కేంద్రం ఏర్పాటు చేసిన సిట్ ప్రస్తుతం ఉన్న నగదు నిల్వ నిబంధనను సవరించాలని సూచించింది. ఈ సందర్భంగా సిట్‌కు నేతృత్వం వహించిన రిటైర్డు జడ్జి జస్టిస్ ఎంబి షా మాట్లాడుతూ ఎవరైనా వ్యక్తిగాని, సంస్థ గాని 15 లక్షలకు మించి నగదు ఉండరాదనే నిబంధనను సవరించి 20 లక్షలకు పెంచారని చెప్పారు.
అయితే ఇటీవల తాము జరిపిన దాడుల్లో పెద్దయెత్తున నగదు పట్టుబడటం, వాస్తవ పరిస్థితులను పరిశీలించిన తర్వాత ఈ మొత్తాన్ని కోటి రూపాయలకు పెంచాలని కేంద్రానికి సిఫార్సు చేస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా పరిమితికి మించి ఉండటంతో సీజ్ చేసే నగదును నేరుగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ట్రెజరీకి పంపేలా నిబంధన ఉండాలని ఆయన సూచించారు. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం పరిమితికి మించి నగదు కలిగి ఉన్న వారు 40 శాతం ఆదాయపు పన్ను, పెనాల్టీ కట్టి బయటపడుతున్నారని ఆయన చెప్పారు. ఈనెల 16న ఆదాయపు పన్ను అధికారులు తమిళనాడులో రహదారుల నిర్మాణం చేపట్టే ఒక కంపెనీ, దాని అనుబంధ సంస్థలకు చెందిన 20 కార్యాలయాలపై చేసిన దాడుల్లో 160 కోట్ల నగదు, 100 కేజీల బంగారం పట్టుబడిందని చెప్పారు.
ఇంత పెద్ద నగదు పట్టుబడటం చూస్తే, ఇలాంటి కేసుల్లో 20 లక్షల నిబంధన ఎలాంటి ప్రభావం చూపదని అన్నారు. అందుకే తాము నగదు పరిమితిని పెంచాలని కేంద్రానికి సిఫార్సు చేసినట్టు సిట్ హెట్ జస్టిస్ ఎంబి షా సూచించారు.