బిజినెస్

మార్కెట్లపై ‘అవిశ్వాసం’ ప్రభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: మదుపరులు ఆచితూచి వ్యవహరించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు గురువారం స్వల్పంగా పడిపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ సెషన్ ఆరంభంలో పొందిన లాభాలను కోల్పోయి, చివరకు 22 పాయింట్లు పడిపోయి 36,351.23 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా 23.35 పాయింట్లు (0.21 శాతం) దిగజారి 10,957 పాయింట్ల వద్ద స్థిరపడింది. అధిక విలువల వద్ద ఉన్న స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లు గురువారం కూడా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. కార్పొరేట్ కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండకపోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. లోక్‌సభలో ఎన్‌డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం ఓటింగ్‌కు రానున్న తరుణంలో మదుపరులు తాజాగా కొనుగోళ్లు జరపడానికి ముందుకు రాలేదని బ్రోకర్లు చెప్పారు. రూపాయి విలువ పడిపోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపిందని వారు పేర్కొన్నారు. గురువారం ఇంట్రా-డేలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మళ్లీ 69 మార్కును దాటింది. గురువారం ఉదయం అధిక స్థాయి వద్ద ప్రారంభం అయిన సెనె్సక్స్ తరువాత మరింత ముందుకు సాగుతూ 36,515.58 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే, కొద్ది సేపటికే దిగజారి 36,279.33 పాయింట్ల కనిష్ట స్థాయికి చేరింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 22.21 పాయింట్ల (0.06 శాతం) దిగువన 36,351.23 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా క్రితం ముగింపుతో పోలిస్తే 23.35 పాయింట్ల (0.21 శాతం) దిగువన 10,957.10 పాయింట్ల వద్ద స్థిరపడింది. అంతకు ముందు ఇంట్రా-డేలో ఈ సూచీ 11,006.50- 10,935.45 పాయింట్ల మధ్య కదలాడింది. ఇదిలా ఉండగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) బుధవారం నికరంగా రూ. 111.01 కోట్ల విలువయిన షేర్లను, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 95.68 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు.
ఐటీ సంస్థ మైండ్‌ట్రీ నికర లాభం తొలి త్రైమాసికంలో 13 శాతానికి పడిపోవడంతో ఆ కంపెనీ షేర్ల విలువ గురువారం 8.67 శాతం తగ్గింది. సెనె్సక్స్ ప్యాక్‌లోని కోటక్ మహీంద్ర బ్యాంక్ తొలి త్రైమాసికంలో ఆశించిన ఆదాయాన్ని ఆర్జించలేకపోవడంతో ఆ సంస్థ షేర్ల విలువ అత్యధికంగా 3.69 శాతం పడిపోయింది. నష్టపోయిన ఇతర సంస్థలలో ఎల్‌అండ్‌టీ, హీరో మోటోకార్ప్, టాటా స్టీల్, కోల్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, సన్ ఫార్మా, టీసీఎస్, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎన్‌టీపీసీ ఉన్నాయి. ఓఎన్‌జీసీ షేర్ విలువ 0.69 శాతం పెరిగింది. లాభపడిన ఇతర సంస్థలలో వేదాంత, యెస్ బ్యాంక్, ఐటీసీ, భారతి ఎయిర్‌టెల్, అదాని పోర్ట్స్, రిల్, యాక్సిస్ బ్యాంక్, ఆసియన్ పెయింట్స్ ఉన్నాయి. రంగాల వారీగా చూస్తే బీఎస్‌ఈ క్యాపిటల్ ఇండెక్స్ 1.80 శాతం పడిపోయింది. హెల్త్‌కేర్ 1.25 శాతం, ఐటీ 0.79 శాతం, టెక్ 0.62 శాతం, పవర్ 0.58 శాతం చొప్పున దిగజారాయి.