బిజినెస్

రెండు వారాల లాభాలకు తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 21: దేశీయ స్టాక్ మార్కెట్ల రెండు వారాల లాభాలకు తెరపడింది. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో స్వల్పంగా నష్టపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 45.26 పాయింట్లు పడిపోయి 36,496.37 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కీలకమయిన 11,000 పాయింట్ల స్థాయికి పైన నిలదొక్కుకోగలిగింది. ఈ సూచీ స్వల్పంగా 8.70 పాయింట్లు దిగజారి 11,010.20 పాయింట్ల వద్ద ముగిసింది. మదుపరుల అప్రమత్తత మధ్య సాగిన ఈ వారం లావాదేవీలపై జూన్ నెలలో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నాలుగేళ్ల గరిష్ఠ స్థాయి అయిన 5.77 శాతానికి పెరగడం ప్రతికూలంగా పరిణమించింది. టోకు ద్రవ్యోల్బణం భారీగా పెరగడంతో రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఆగస్టులో జరిపే ద్రవ్య విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు పెరిగాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు నాలుగు శాతం తగ్గడం, కార్పొరేట్ కంపెనీలు తొలి త్రైమాసికంలో మంచి ఆదాయాలు ఆర్జించడం, ఆర్థికంగా చితికిపోయిన ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూల ధనాన్ని సమకూర్చడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వచ్చిన వార్తలు ఈ వారంలో కొంత మేరకు స్టాక్ మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి. ఎన్‌డిఏ ప్రభుత్వంపై లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పట్ల మదుపరులు రెండు రోజులు రెండు రకాలుగా స్పందించారు. అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చిన తరువాత గురువారం మదుపరులు ఆందోళన చెంది ఆచితూచి వ్యవహరించారు. కొత్తగా కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు. అయితే, ఈ అవిశ్వాస తీర్మానంపై ఇంకా ఓటింగ్ జరగకముందే శుక్రవారం ఐటీ, ఫార్మా షేర్ల ధరలలో వచ్చిన ర్యాలీతో మార్కెట్ కీలక సూచీలు తిరిగి పుంజుకున్నాయి. ఈ వారంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు కనిష్ట స్థాయి 69.13కు చేరింది.
బీఎస్‌ఈ సెనె్సక్స్ ఈ వారం సానుకూలంగా 36,658.71 పాయింట్ల సానుకూల స్థాయి వద్ద ప్రారంభమయి, సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి అయిన 36,747.87 పాయింట్లు, కనిష్ట స్థాయి అయిన 36,261.78 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం వారం ముగింపుతో పోలిస్తే స్వల్పంగా 45.26 పాయింట్ల (0.21 శాతం) దిగువన 36,496.37 పాయింట్ల వద్ద ముగిసింది. సెనె్సక్స్ క్రితం రెండు వారాలలో కలిసి 1118.15 పాయింట్లు (3.16 శాతం) పుంజుకుంది.
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఈ వారం 11,018.95 పాయింట్ల అధిక స్థాయి వద్ద ప్రారంభమయి, 11,076.20- 10,925.60 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం వారం ముగింపుతో పోలిస్తే స్వల్పంగా 8.70 పాయింట్ల (0.08 శాతం) దిగువన 11,010.20 పాయింట్ల వద్ద ముగిసింది.
స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ సూచీలు రెండూ కూడా ఈ వారం గణనీయంగా నష్టపోయాయి. లోహ, స్థిరాస్తి, ఆరోగ్య సంరక్షణ, వాహన, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎంసీజీ, పవర్, బ్యాంక్‌లు, ఐపీఓల షేర్లు ఈ వారం అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. చమురు- సహజ వాయువు, ఐటీ, కన్స్యూమర్ డ్యూరేబుల్, టెక్, పీఎస్‌యూల షేర్ల ధరలు ఈ వారంలో పెరిగాయి. ఇదిలా ఉండగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు), విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐలు) ఈ వారంలో నికరంగా రూ. 1,059.35 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు.