బిజినెస్

రోడ్డెక్కిన టమోటా రైతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, మార్చి 25: టమోటా రైతులు రోడ్డెక్కారు. తక్కువ దిగుబడులు వస్తున్నా కిలో టమోటాలు కేవలం రెండు రూపాయలకే కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, మండీ వ్యాపారులు కుమ్మక్కవ్వడం వల్లే ధరలు పతనమవుతున్నాయన్న రైతులు.. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. దిగజారిన ధరలకు నిరసనగా చిత్తూరు జిల్లా మదనపల్లెలో శుక్రవారం ఉదయం మార్కెట్‌కు తెచ్చిన టమోటాలను రోడ్డుపై పారబోసి రైతులు తమ నిరసనను వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించి కొద్దిసేపు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్, సిపిఐ జిల్లా పార్టీ కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ ఇటు అధికారులు, అటు వ్యాపారులు సిండికేట్‌లుగా మారుతున్నారని, దీనివల్ల మార్కెట్‌కు తీసుకువచ్చిన టమోటాల వేలం పాటలలో రైతులు మోసపోతున్నారన్నారు. తక్కువ దిగుబడులు వస్తున్నా టమోటా ధర కిలో కేవలం రెండు రూపాయలు పలకడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అయనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
అలాగే మదనపల్లె మార్కెట్‌లో మార్కెటింగ్ అధికారుల పర్యవేక్షణ లేకుండా వ్యాపారులే సిండికేట్‌లుగా మారి వేలం నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. అనంతరం రూపాయిన్నర, రెండు రూపాయలు పలికిన టమోటాలను రైతులే స్వయంగా రోడ్డుపై పారబోసారు. ముంబై-చెన్నై జాతీయ రహదారి నీరుగట్టువారిపల్లె టమోటా మార్కెట్ ప్రధాన గేటుకు ఎదురుగా రైతులు, రైతు సంఘం నాయకులు, సిపిఐ నాయకులు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గంటన్నరపాటు జరిగిన ఆందోళన అనంతరం మార్కెట్ అధికారులతో చర్చించారు.